టికెట్టు కొని విమానం ఎక్కాడు.. అక్కడే బిక్షాటన చేసాడు?

praveen
సాధారణంగా భిక్షాటన చేసేవారు అనే పదం వినిపించగానే గుడిమెట్ల మీద కూర్చొని దానం చేయండి మహాప్రభు అని ఇక గుడిలోకి వచ్చి పోయే భక్తులను వేడుకునేవారు ముందుగా గుర్తుకు వస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు కేవలం గుడిమెట్ల మీద మాత్రమే ఇలా భిక్షాటన చేసేవారు కనిపించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎక్కడపడితే అక్కడ భిక్షాటన చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక రోడ్డుపై వెళ్తూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పబ్లిక్ పార్కుల్లో సైతం బిక్షాటన  చేస్తున్నవారు తారసపడుతూ ఉన్నారు నేటి రోజుల్లో. చిరిగిన దుస్తులు వేసుకొని ఇక దానం చేయండి అంటూ కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా వేడుకొంటూ ఉంటారు.

 కానీ ఏకంగా విమానంలో కూడా భిక్షాటన చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా. విమానంలో భిక్షాటన చేయడమా.. ఇలాంటివి అల్లరి నరేష్ నటించిన సుడిగాడు లాంటి సినిమాల్లో తప్ప నిజ జీవితంలో మాత్రం జరగడం అసాధ్యం అని అంటారు ఎవరైనా. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసిన ఒక వ్యక్తి.. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఇక అందులో ఉన్న మిగతా ప్రయాణికుల దగ్గర భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే ఇలా విమానంలో భిక్షాటన చేసిన యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. విగ్నేష్ అనే యువకుడు చెన్నైకి టికెట్ కొనుగోలు చేసి విమానం ఎక్కాడు. ఇక విమానం గాల్లోకి ఎగరగానే  భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని.. చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని.. ప్రయాణికుల దగ్గరికి వెళ్లి ప్రాధేయపడుతూ డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. అయితే అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత విగ్నేష్ ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. అతని దగ్గర 26 క్రెడిట్ కార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: