సీట్ బెల్ట్ పెట్టుకోలేదని.. స్కూటీ డ్రైవర్ కు జరిమానా?

praveen
సాదరణం గా వాహనదారులు తమ వాహనాన్ని బయటకు తీయాలి అంటే చాలు తప్పని సరిగా రోడ్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకవేళ ద్విచక్ర వాహనదారులు అయితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా సీట్ బెల్టు పెట్టుకోవాలి. అయితే ఇలా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించారు అంటే చివరికి పోలీసులు జరిమానా విధించడం లాంటివి చేస్తూ ఉంటారు.

 అయితే ఇటీవల కాలంలో ఇలా రోడ్డు నిబంధనలు పాటించకుండా ఉంటున్న వారిపై అటు పోలీసులు కఠినం గానే వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించడమే కాదు.. సీసీ కెమెరాల నిఘా ద్వారా ఇక రూల్స్ అతిక్రమిస్తున్న వారికి జరిమాణాలు విధిస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తూ ఉన్నాయి. దీంతో ఇక ఈ భారీ జరిమానాలకు భయపడి మరీ  అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. అయితే కొంత  మంది ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడం విషయం లో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి పప్పు లో కాలేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.

 మొన్నటికి మొన్న కారు లో వెళుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా వేసిన ఘటన సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు స్కూటీ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సీట్ బెల్టు పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన ఘటన అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. బీహార్ లోని సమితి పూర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. అక్టోబర్  బైక్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని 1000 రూపాయల ఫైన్ పడిందని.. గత నెలలో మెసేజ్ వచ్చింది. ఫైన్ చెల్లించినట్లు కూడా మెసేజ్ లో ఉంది. అయితే స్కూటీ ఓనర్ కృష్ణ కుమార్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం తో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: