బాబోయ్.. ఎంత ఈజీగా బైక్ చోరీ చేశారో చూడండి?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద అంతకంతకు ఎక్కువ అయిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్న అందిన కాడికి దోచుకుపోతున్నారు. అయితే ఇలా చోరీలను నివారించేందుకు పోలీసులు ఎక్కడికి అక్కడ సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ దోపిడి దొంగలు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎంతో దర్జాగా వచ్చి కావాల్సిన వస్తువులను దోచుకు వెళ్తున్నారు అని చెప్పాలి. ఒకప్పుడు తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీకి పాల్పడేవారు దొంగలు.

 కానీ ఇప్పుడు మాత్రం అది ఇది అనే తేడా లేదు. ఏదీ దొరికితే దాన్ని దోచుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇంటి బయట పార్క్ చేసి ఉన్న వాహనాలనే టార్గెట్ చేసుకుంటూ ఎంతో చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయ్. ఇక ఇలాంటి వీడియోలు  సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి చోరీనే జరిగింది. కొందరు దొంగలు కేవలం క్షణాల్లో రెండు బైకులను చోరీ చేసిన వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంత సులభంగా దొంగలు బైక్ చోరీ చేస్తారా అని అందరిలో ఆశ్చర్యం కలుగుతుంది.

 మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వీధిలో ఇళ్ళ ముందు వరుసగా బైకులు పార్క్ చేసి ఉన్నాయి. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు దొంగలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత ఎవరూ బయటికి రాకుండా ఇలా బయట నుండి గడియ పెట్టారు. శబ్దం వచ్చిన ఇంట్లో వారు బయటకు రాకుండా గడియ పెట్టి జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత హ్యాండిల్ లాక్ వేసి ఉన్నప్పటికీ కూడా రెండు బైకులను ఎంతో ఈజీగా చాకచక్యంగా చోరీ చేశారు దొంగలు. క్షణాల వ్యవధిలో రెండు బైకులను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డు కాగా.. పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: