విమానాల్లో అనుచితంగా ప్రవర్తిస్తే.. ఇక అంతే?

praveen
సాధారణం 
గా విమానాల్లో ప్రయాణిస్తున్న వారు ఎప్పుడు ఇతరులతో హుందాగా నడుచుకుంటారు అనే భావన అందరిలో ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం విమానం లో ప్రయాణిస్తే ఏంటి చిల్లర పనులు చేసే ప్రయాణికులు కూడా చాలా మంది ఉంటారు అన్నది వెలుగు లోకి వచ్చే ఘటనల ద్వారా అర్థమవుతుంది. ఇక భారీగా ఖర్చుపెట్టి విమానాల్లో ప్రయాణిస్తున్న వారు చిన్న విషయం లో ఏకంగా ఇతరులతో గొడవపడటం... అంతేకాకుండా విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు కూడా ఇటీవల వెలుగు చూస్తున్నాయి అని చెప్పాలి.

 కొంతమంది ఏకంగా విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులపై దాడికి పాల్పడుతూ ఉండగా ఇలాంటి   వీడియోలు కూడా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయ్. మరి కొన్నిసార్లు ఏకంగా ఎయిర్ హోస్టస్ తో మర్యాదపూర్వకంగా కాకుండా అసభ్య పదజాలంతో మాట్లాడటం ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి అని చెప్పాలి. అయితే విమానాల్లో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ఇక ప్రస్తుతం అంతా సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే డీజీసీఏ ఇటీవలే కఠిన నిర్ణయం తీసుకుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇకనుంచి విమానాల్లో కొద్దిమంది ప్రయాణికులు తోటి ప్రయాణికుల  పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుండగా.. ఇకనుంచి అలాంటిది జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది డీజీసీఏ. సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసే వారిని విమానం ల్యాండ్ అయిన తర్వాత అరెస్టు చేయాలి అంటూ సూచించింది. ఇటీవల కాలంలో విమానాల్లో పొగతాగడం మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించడం.. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం లాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్న నేపథ్యంలో డీజీసీఏ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. మరి ఇలాంటి నిబంధన వచ్చిన తర్వాత అయినా.. అటు ప్రయాణికుల తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: