అఘోరి పూజ కోసం.. భార్య పీరియడ్ బ్లడ్ అమ్మేసిన భర్త?

praveen
ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాల ఊబిలో  కూరుకుపోతున్న మనుషులు కనిపిస్తున్నారు అన్నది వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతుంది. ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్ముతున్న వారు ఆధునిక సభ్య సమాజంలో కూడా బ్రతుకుతున్నారు అన్నది అందరిని అవాక్కయ్యలా చేస్తూ ఉంది అని చెప్పాలి.  ఏకంగా మంత్రాల నెపంతో నరబలులు ఇస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. మరికొన్ని చోట్ల మంత్రాలు చేస్తున్నారు అనే కారణంతో దారుణంగా కొందరు వ్యక్తులను కొట్టి చంపుతున్న ఘటనలు కూడా ఇప్పుడు వరకు చూశాము.

 అయితే ప్రపంచాన్ని మొత్తం అరచేతిలోనే మనిషి చూసేస్తున్న నేటి కాలంలో కూడా ఇంకా ప్రజల్లో నిండిపోయిన మూఢనమ్మకాలను పోగొట్టేందుకు అధికారులు అవగాహన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అగోరి పూజ కోసం ఒక భర్త చేసిన పని కాస్త ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేసింది.  నేటి సభ్య సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అని చెప్పాలి.

 అగోరి పూజ కోసం ఏకంగా భార్య రుతుక్రమం రక్తాన్ని బలవంతంగా తీసుకుని అమ్ముకున్నాడు భర్త. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పూనే కు చెందిన 27 ఏళ్ల మహిళకు పిల్లలు లేరు.  అయితే భర్త అత్తమామలు చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవారు. ఇకపోతే ఇటీవలే ఏకంగా పీరియడ్ బ్లడ్ ను తీసుకొని ఏకంగా పూజ చేస్తున్న అగోరికి 50వేల రూపాయలకు దానిని అమ్మేశారు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయింది సదర మహిళ. ఇక పోలీసుల న్యాయం చేస్తారు అని భావించి ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు అత్తమామలు కూడా చేసిన విషయాన్ని చెప్పడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: