కొలిక్కి వచ్చిన మర్డర్ మిస్టరీ.. చంపింది ఎవరో కాదు?

praveen
ఇటీవల కాలంలో బంధాలకు బంధుత్వాలకు అసలు విలువలేదు అన్న విషయం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చెప్పకనే చెబుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒకప్పుడు పరాయి వాళ్ళు ఎటు పోయిన నేను నా కుటుంబ సభ్యులు బాగుంటే అదే చాలు అని అనుకునేవారు ఎంతోమంది. ఈ క్రమంలోనే ఇక కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవారు.  కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే పరాయి వ్యక్తుల గురించి దేవుడు ఎరుగు ఏకంగా సొంత వారి విషయంలోనే దారుణంగా ప్రవర్తిస్తున్న మనుషులు కనిపిస్తున్నారు. ఏకంగా హత్యలు చేయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి.

 వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సొంతవారే ప్రాణాలు తీస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.  అయితే కొన్ని కొన్ని చోట్ల ఏకంగా ఆస్తుల కోసం కనిపించిన తల్లిదండ్రులను పిల్లలు చంపేస్తూ ఉంటే.. మరికొన్ని చోట్ల ఏకంగా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలని తల్లిదండ్రులు హతమరుస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇక ఇటీవల సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ లో ఇలాంటి ఘటన జరిగింది.

 ఇటీవలే జహంగీర్ అనే 42 ఏళ్ళ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే చంపింది ఎవరో కాదు తండ్రి సాయి మల్లయ్య అన్న విషయం పోలీసు విచారణలో బయటపడింది. జాలాయిగా తిరుగుతూ భార్య లక్ష్మితో తరచు గొడవ పడటంతో ఇక విసిగిపోయిన ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత అతని తీరు మార్చుకోకుండా.. తల్లిదండ్రులను తీర్చడంతో పాటు పలుమార్లు గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు జహంగీర్. అయితే అతని తీరుతో ఊర్లో పరువు పోతుందని భావించిన తండ్రికి సాయి మల్లయ్య మద్యం మత్తులో కొడుకుని  దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నాటకమాడగా పోలీస్ విచారణలో అసలు నిజం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: