మందు పై పందెం కాసాడు.. చివరికి ప్రాణం పోయింది?

praveen
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలుసు . కానీ మద్యం విషయంలో ఎంతోమంది పందెంకాసీ మరి ఎక్కువగా మద్యం తాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను తోపుని ఎంత మద్యం తాగినా ఔట్ అవ్వను.. నాకు కిక్ ఎక్కదు అని తోటి స్నేహితులతో బెడ్ కట్టి చివరికి ఎక్కువ మద్యం తాగి ఎంతోమంది ఇక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బెట్ కాసి మరి తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తాగిన ఒక వ్యక్తి చివరికి కేవలం గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది.

 45 ఏళ్ల జై సింగ్ యూపీలోని ఆగ్రాలో నివాసం ఉంటున్నాడు. ఈ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు జై సింగ్. అయితే అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఇటీవల ఇద్దరు స్నేహితులతో మద్యం విషయంపై చర్చ కొనసాగించాడు. 10 నిమిషాల్లో మూడు క్వార్టర్లు తాగేయాలి అంటూ స్నేహితులు పందెం కాశారు. ఒకవేళ జై సింగ్ పందెంలో ఓడిపోయినట్లయితే ఇద్దరు స్నేహితులు ఎంత తాగితే అంత బిల్లు కట్టాలని పందెం వేసుకోగా.. జై సింగ్ కూడా అంగీకరించాడు. ఇక పందెం గెలవాలని ఆత్రుతతో పది నిమిషాల్లోనే మూడు క్వాటర్లు తాగేశాడు జై సింగ్.

 కానీ ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కాగా జై సింగ్ కి నలుగురు సంతానం ఉన్నారు. ఇందులో ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉండగా అందరూ కూడా మైనర్లే కావడం గమనార్హం. జై సింగ్ స్నేహితులు బోలా, కేశవులు పది సంవత్సరాల నుంచి స్నేహభావంతోనే ఉన్నారని అయితే ఇటీవల జైసింగ్ మద్యం తాగిన తర్వాత అతని ఆరోగ్యం క్షీణించింది అన్న విషయం తెలిసి అతని దగ్గర ఉన్న అరవై వేల రూపాయల నగదు తీసుకొని పరారయ్యారు అంటూ జై సింగ్ సోదరుడు వెల్లడించాడు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: