దారుణం : భార్యను చంపి.. సమాధిపై పూల మొక్కలు నాటాడు?

praveen
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా ఉండేది. కానీ నేటి రోజుల్లో మాత్రం దాంపత్య బంధం అనేది చంపడానికి లేకపోతే చావడానికి చిరునామాగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే మూడుముళ్ల బంధంతో ఇక కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన యువతి యువకులు ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సింది పోయి ఏకంగా కట్టుకున్న వారికే కష్టాలను తెచ్చిపెడుతూ ఉన్నారు. అంతేకాదు కట్టుకున్న వారి పాలిట కాల యముడిగా మారిపోయి దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 పెళ్లి సమయంలో ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అంటూ చేసిన ప్రమాణాలను మరిచిపోయి ఎంతోమంది కట్టుకున్న వారి విషయంలో కర్కశంగా ప్రవర్తిస్తున్న తీరు పెళ్లి అనే పదం మీద అందరికీ ఉన్న భావనను మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా దంపతుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు చివరికి హత్యలకు కారణం అవుతూ ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది  ఘజియాబాద్ కు చెందిన దినేష్ కూరగాయల వ్యాపారం అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.

 ఇక ఇటీవల ఇదే విషయంపై మరోసారి భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త దినేష్ భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు  ఇక ఆ తర్వాత భార్య శవాన్ని తీసుకెళ్లి వ్యవసాయ భూమిలో పాతిపెట్టాడు. ఇక మృతదేహం కుళ్ళిపోవడం కోసం సమాధిలో 30 కేజీల ఉప్పును కూడా పోశాడు. తర్వాత భార్య సమాధిపైనే ఏకంగా పూల మొక్కలు నాటి పెంచుతున్నాడు. అయితే భార్య కనిపించడం లేదని ఏమీ ఎరుగన్నట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. అస్సలు నిజం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: