అవసరమా బ్రో.. బుల్లెట్ బండి పై వచ్చి.. చివరికి?

praveen
ఇటీవల కాలం లో ఎంతో మంది యువకులు బైక్ లపై విన్యాసాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమకు నచ్చిన కాస్ట్లీ బైక్ ను కొనుగోలు చేయడం ఇక రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఇక ఎన్నో విన్యాసాలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటివి చేయడం ద్వారా ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇలా విచిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉన్న వాహనదారులకు అటు ట్రాఫిక్ పోలీసులు కూడా జరిమానాలు విధిస్తూ షాక్ ఇస్తున్నారు.

 అయితే ఇక ఇలా బైక్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు అయితే అటు సోషల్ మీడియాలో తరచూ ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే కొంతమంది ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ చివరికి ప్రమాదాల బారిన పడుతూ ఇక ప్రాణాపాయ పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో కూడా ఇలాంటిదే జరిగింది. ఒక యువకుడు ఎంతో స్టైల్ గా బుల్లెట్ బండిపై దూసుకు వచ్చాడు. కానీ తిన్నగా బైక్ నడపకుండా విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించాడు.

 ఇక అతడు వాహనం నడిపిన తీరుతో ఇతను వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ చివరికి అతని తిక్క కుదిరింది. ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో బుల్లెట్ బండి పై వచ్చిన అతనికి బుల్లెట్ తెగినంత పని అయింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి అన్నది ఇక ట్విటర్లో వైరల్ గా మారిపోయిన వీడియోలు చూస్తే అర్థమవుతుంది అని చెప్పాలి. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇది చూసిన నెటిజన్స్ ఇలాంటి రిస్కీ విన్యాసాల అవసరమా బ్రో.. చూడు ఇప్పుడు ప్రాణాలు మీదికి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: