ఆన్లైన్లో మొబైల్ ఆర్డర్ పెట్టింది.. కానీ సీన్ కట్ చేస్తే?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ యుగమే నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మనిషికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో దొరుకుతుంది. ఈ క్రమంలోనే అన్ని రకాల సర్వీస్ లను అందించేందుకు ప్రస్తుతం ఎన్నో రకాల కంపెనీలు పోటీ పడుతున్నాయని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎన్నో ఈ కామర్స్ సంస్థలు జనాలకు కావలసిన అన్ని వస్తువులను కూడా ఒక క్లిక్ తో ఇంటి ముంగిటికే తెచ్చిస్తూ ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

 దీంతో ఎంతో వేగంగా తమకు నచ్చిన వస్తువును ఇంటి ముంగిటికే పొద్దగలుగుతున్నారు అని చెప్పాలి. కానీ ఇటీవలే కాలంలో ఆన్లైన్ ఆర్డర్లపై  ఎక్కువ ఆధారపడిన కూడా కొన్ని కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంది అని చెప్పాలి. బెంగళూరులో జరిగిన ఘటన కూడా ఇందుకు నిదర్శనంగా మారిపోయింది. రాజాజీ నగర్ కు చెందిన దివ్యశ్రీ అనే మహిళ ప్రముఖ ఈ కామర్స్ సైట్ అయిన ఫ్లిప్కార్ట్ లో 12,500 విలువ చేసే ఒక మొబైల్ ను ఆర్డర్ పెట్టింది. ముందుగానే మని చెల్లించింది. అయితే 2022 జనవరి 15 కు ఆర్డర్ పెడితే ఇప్పటివరకు ఆమెకు ఫోన్ డెలివరీ కాలేదు.
 డబ్బులు కూడా వెనక్కి రాలేదు. ఇదే విషయంపై ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ ను సంప్రదించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ కామర్స్ వెబ్సైట్ పై వినియోగదారుల కోర్టుకెక్కింది సదర మహిళ. ఇక దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇక ఇటీవల తుది తీర్పును వెల్లడించింది. 12500 మొబైల్ ఖరీదు తో పాటు వార్షిక వడ్డీ 12 శాతం మరియు 20వేల రూపాయల తోపాటు పదివేల రూపాయల లీగల్ ఖర్చులు కూడా ఫ్లిప్కార్ట్ సదరు కస్టమర్ కు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది వినియోగదారుల కోర్టు. ఒక కస్టమర్ విషయంలో ఫ్లిప్కార్ట్ పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: