మెంతో ప్లస్.. చిన్నారి ప్రాణాలు తీసేసింది?

praveen
ఇటీవల కాలంలో మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకు వస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కేవలం నిమిషాల వ్యవధిలోనే మృత్యువు దూసుకు వచ్చి ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది. దీంతో ఆనందంగా ఉన్న కుటుంబంలో అరణ్య రోధనలు మిగులుస్తూ ఉంటుంది విధి. ఇటీవల కాలంలో ఎన్నో రకాల వైరస్లు మనుషుల ప్రాణాలు తీసేందుకు దూసుకు వస్తూ ఉంటే మరోవైపు ఊహించని ఘటనలు మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి.

 అయితే ఇలా అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా విధి ఏకంగా కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉండడం చూసిన తర్వాత ఓ దేవుడా నీకు కాస్తయినా కరుణ లేదా అని ప్రతి ఒక్కరి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  పెళ్లయిన 20 ఏళ్ల వరకు ఆ దంపతులకు అసలు పిల్లలు లేరు. దీంతో వాళ్ళు మొక్కని దేవుడు లేడు.. తిరగని హాస్పిటల్ అంటూ లేదు. దీంతో పెళ్లైన 20 ఏళ్ల తర్వాత సంతానం కలిగింది. దీంతో ఇక ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ఇలా తల్లిదండ్రుల సంతోషాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది.

 20 ఏళ్లకు పండంటి మగ బిడ్డ పుట్టాడు అని ఎంతో సంతోషం లో ఉన్న ఆ తల్లిదండ్రుల జీవితాల్లో 10 నెలల్లోనే చీకట్లు కమ్ముకున్నాయి. కర్నూలు జిల్లా చింతామను పల్లెలో నల్లన్న, సువర్ణ దంపతులకు పెళ్లయిన 20 ఏళ్లకి ఒక కొడుకు పుట్టాడు. ఇక అతని వయసు 10 నెలలు మాత్రమే. ఇటీవలే న్యూ ఇయర్ రోజున రాత్రి బంధువులతో కలిసి సరదాగా గడుపుతుండగా బాలుడు మెంతో ప్లస్ డబ్బాతో ఆడుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు అది గొంతులో దిక్కుపోయింది. ఇక వెంటనే తల్లిదండ్రులు కంగారుపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమంలోనే ప్రాణాలు వదిలాడు. దీంతో అరణ్య రోదనగా తల్లిదండ్రులు విలపించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: