ఓరి నాయనో.. ఎంత దారుణంగా నరికి చంపారో చూడండి?

praveen
ఇటీవల కాలం లో మనుషులు మనుషుల్లా ఉండడం లేదు ఏకంగా అడవుల్లో ఉండే క్రూర మృగాల కంటే క్రూరం గా మారి పోతున్నారు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి.. ఇలా ఇటీవల కాలం లో ఎన్నో దారుణమైన హత్యలకు సంబంధించిన ఘటనలు వెలుగు లోకి వస్తూ అందరిని ఉలిక్కిపడేలా చేస్తూన్నాయ్. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది.

 ఆరుగురు మైనర్లు ఒక బైకును వెంబడించి మరి కాలేజీ విద్యార్థిని దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. బన్వర్ కౌన్ ప్రాంతం లో ఆయుష్ అనే 22 ఏళ్ళ యువకుడు మరో ఇద్దరి స్నేహితుల తో కలిపి బైక్ పై వెళ్తున్నాడు. అయితే రద్దీగ ఉన్న రోడ్డుపై కొంతమంది అబ్బాయిలు నిలబడి వాహన రాక పోకలకు అంతరాయం కలిగించారు. అదే పనిగా హారన్ కొట్టిన ఆయుష్.. దారిని క్లియర్ చేసి వాహనాలు వెళ్లేందుకు దారి ఇవ్వాల్సిందిగా వారిని కోరాడు  ఈ క్రమం లోనే ఆయుష్ కి మైనర్లకి మధ్య గొడవ జరిగింది.

 ఈ క్రమం  లోనే మైనర్లు రెచ్చి పోయారు. ఏకంగా బైక్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్లి ఇక వెనకాల కూర్చున్న ఆయుష్ పై  కత్తితో విచక్షణ రహితం గా దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు  సీసీటీవీ కెమెరాల లో రికార్డు అయ్యాయి అని చెప్పాలి  ఈ వీడియో కాస్త ట్విట్టర్  వేదిక వైరల్ గా మారి పోయింది. ఇక ఇలా ఏకంగా బైక్ ను వెంబడించి మరీ వెనకాల ఉన్న ఆయుష్ ను దారుణంగా కత్తితో పొడవడం తో రక్తపు మడుగులో ఆయుష్ అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: