వీడు భర్త కాదు రాక్షసుడు.. భార్య జననంగాల్లోకి కర్ర జొప్పించి?

praveen
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ . కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఆ అన్యోన్యతే ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పాలి. మూడుముళ్ల బంధంతో వందేళ్లు కలిసి జీవించడానికి పెద్దల ఆశీర్వాదాలు సాక్షిగా దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన వారు ఇక కొన్నాళ్లు కూడా తిరగకుండానే చివరికి విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్న ఘటనలు నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది విడాకులతో విడిపోవడం చేస్తూ ఎవరి దారిన వారు వెళ్ళిపోతుంటే.. కొంతమంది మాత్రం ఏకంగా కట్టుకున్న వారిని చిత్రహింసలకు గురి చేస్తూ ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత కట్టుకున్న భార్యకు ఏ కష్టం వచ్చినా తోడు నీడగా ఉండాల్సిన భర్త.. చివరికి ఆమె పాలిట యమకింకరుడిగా  మారిపోయాడు. దీంతో ఏ కష్టం వచ్చినా చూసుకోవలసిన భర్త చివరికి ప్రాణం తీసేసాడు. ఏకంగా భార్య జననాంగాల్లోకి  కర్ర జొప్పించి  దారుణంగా హత్య చేసి రాక్షసానందాన్ని పొందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సింగ్వార్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ హత్యతో స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అని చెప్పాలి.

 మధ్యప్రదేశ్ లోని మాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమిహియా గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి తన భార్యపై అనుమానం వచ్చింది. అయితే వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని.. తరచూ అనుమానిస్తూ సూటిపోటి మాటలతో వేధించేవాడు భర్త. ఇక ఇటీవల ఇదే విషయంపై భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇక ఈ వాగ్వాదం ఘర్షణగా మారిపోయింది. దీంతో కోపంలో విచక్షణ కోల్పోయిన సదర వ్యక్తి తన భార్య జననాంగాల్లోకి  ఒక పదునైన కర్రను జొప్పించాడు.   దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.  ఇక ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండడం గమనార్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: