కొడుక్కి విదేశాల్లో ఉద్యోగం.. సూసైడ్ చేసుకున్న తల్లి?

praveen
సాధారణంగా తల్లిదండ్రులు అందరు కూడా తమ కొడుకు బాగా చదువుకొని ప్రయోజకుడు కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొడుకు భవిష్యత్తు బాగుండాలి అన్న కారణంతో తాహతకు మించి ఫీజులు కడుతూ పెద్దపెద్ద విద్యాసంస్థల్లో చదివించడానికి ఇష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇక ఇలా చదివించిన తర్వాత ఇక తమ కొడుకు మంచి ఉద్యోగం సాధిస్తే ఇక అంతకంటే మాకు ఇంకేం కావాలి అని భావిస్తూ ఉంటారు. ఇక ఒకవేళ ఇక కొడుకుకు విదేశాలలో ఉద్యోగం వస్తే ఎంతో సంబరపడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా కొడుకు విదేశాలకు వెళ్లడం  ఆ తల్లికి నచ్చలేదు. ఎంత చెప్పినా  కొడుకు మాత్రం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

 దీంతో అల్లారూ ముద్దుగా పెంచుకున్న కొడుకు తనకు దూరం అవుతున్నాడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది ఆ తల్లి. దీంతో తీవ్ర మనస్థాపంతో కఠిన నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఈ ఘటన ఎక్కడో కాదు నెల్లూరులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. తన మాట వినకుండా కొడుకు ఫారెన్ వెళ్లేందుకు సిద్ధమవడంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. నరసింహారెడ్డి, విజయ దంపతులకు కొడుకులు సదాశివరెడ్డి,భరత్ రెడ్డి ఉన్నారు. అయితే బీటెక్ పూర్తి చేసిన సదాశివరెడ్డి ఫారిన్ లో ఉద్యోగం సంపాదించాడు.

 ఇందు కోసం ఈనెల 25వ తేదీన ఇక దేశం కానీ దేశం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇక్కడే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకుని కుటుంబ బాధ్యతలు చేసుకోవాలని తల్లి కోరింది. కానీ అతను మాత్రం వినకుండా ఫారిన్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: