35 ఏళ్లకు అతికష్టం మీద పెళ్లి.. 15 రోజుల్లో ఊహించని షాక్?

praveen
పెళ్లి అంటే యువతి యువకులు ఇద్దరికీ కూడా ఎంతో ప్రత్యేకమైనది. వందేళ్లపాటు కలిసి ఉండే బంధంలోకి అడుగు పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఇక తమకు నచ్చిన వారిని తమ అభిరుచులకు గౌరవం ఇచ్చే వాడిని పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది యువతులు అనుకుంటారు. ఇక తమను అర్థం చేసుకునే భార్య దొరికితే అంతకంటే ఇంకేం కావాలి అని కోరుకుంటూ ఉంటారు అబ్బాయిలు. కొంతమంది మాత్రం పెళ్లిని ఏకంగా కమర్షియల్ ఎలిమెంట్ గా వాడుకుంటున్నారు. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అతనికి 35 ఏళ్లు ఎంత వెతికిన సంబంధం కుదరలేదు. దీంతో ఎంతో కష్టపడి బ్రోకర్ కి మూడు లక్షలు ఇచ్చి మరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని దాంపత్య బంధం లోకి అడుగుపెట్టాడు. కానీ 15 రోజులు గడవక ముందే అతనికి ఊహించని షాప్ తగిలింది. ఏకంగా భార్య చేసిన పనికి అతనికి కళ్ళు బైర్లు కమ్మాయి అని చెప్పాలి. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది.

 బందర్పూర్ కు చెందిన 35 ఏళ్ల అటల్ బిహారీ అనే వ్యక్తికి వయసు మీద పడటంతో పెళ్లి కావడం ఎంతో కష్టంగా మారింది. బోలెడంత ఆస్తి ఉన్నప్పటికీ అతనికి వధువు మాత్రం దొరకలేదు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ కు చెందిన ఒక బ్రోకర్ కి మూడు లక్షలు చెల్లించి మరి అతి కష్టం మీద పెళ్లి కుదుర్చుకున్నాడు. సోనా జైష్వాల్ అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఆగస్టు మూడవ తేదీన వివాహం కూడా జరిగింది. అయితే 15 రోజులు గడిచింది. కానీ అంతలో భార్య చేసిన పనికి అతని దిమ్మతిరిగిపోయింది. ఇంట్లో నుంచి మూడు లక్షల విలువైన బంగారు నగలతో భార్య పరారయింది. దీంతో చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు అటల్ బిహారీ. ఇక గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు చివరికి భోపాల్లో సోనాల్ ను అరెస్టు చేశారు. ఇదివరకే పెళ్లి అయింది అన్న విషయాన్ని విచారణలో గుర్తించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: