ఓరి నాయనో.. ఓటిపి లేకుండానే.. ఖాతా ఖాళి చేశారు?

praveen
ఇటీవల కాలంలో ఫైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది బ్యాంకు ఖాతాదారులకు ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని.. ఇక మీ బ్యాంకు డీటెయిల్స్ చెప్పాలని.. మీ నెంబర్ కి ఒక ఓటిపి పంపిస్తున్నాం అది చెబితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటూ  మాయమాటలు చెబుతూ ఇక ఎంతోమందిని బురుడి కొట్టిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇలా ఎవరైనా పొరపాటున ఓటిపి చెప్పారు అంటే చాలు చివరికి ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు కోకోల్లలుగా మారిపోయాయి అని చెప్పాలి.

 ఇకపోతే ఇలా ఇప్పటివరకు మాయమాటలతో నమ్మించి ఓటీపీ అడిగే ఖాతా ఖాళీ చేసిన సైబర్ నెరగాళ్ల గురించి విన్నాము. కానీ ఇక్కడ జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి లోన చేస్తుంది అని చెప్పాలి. ఓటీపీ అవసరం లేకుండానే ఖాతాలనుంచి లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఖాతా నుంచి 50 లక్షలు కొల్లగొట్టారు. కేవలం ఫోన్కు మిస్సేడ్ కాల్స్ ఇచ్చి బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ చేసుకున్నారు అని చెప్పాలి.

 ఢిల్లీలోని సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ ఎండికి కొత్త నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఇక పదే పదే అదే నెంబర్ నుంచి కాల్ రావడంతో అతను లిఫ్ట్ చేసి చేసాడు. కానీ అవతలి వ్యక్తి మాట్లాడలేదు. అయితే కాసేపటికి ఆయన బ్యాంకు ఖాతాలో 50 లక్షలు మాయమయ్యాయి అని చెప్పాలి. ఒకసారి 12 లక్షలు, మరోసారి 10 లక్షలు, ఆ తర్వాత 4.6 లక్షలు బ్యాంకు నుంచి బదిలీ అయ్యాయి. ఇక ఈ విషయం అతని రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి వెంటనే పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: