క్రైమ్ థ్రిల్లర్ కాదు అంతకుమించి.. ప్రియుడి కోసం పెద్ద ప్లానే వేసింది?

praveen
ఇటీవల కాలంలో నిజజీవితంలో జరుగుతున్న ఘటనలు ఆధారంగా ఎంతో మంది దర్శక నిర్మాతలు సినిమాలు తీస్తున్నారో.. లేకపోతే సినిమాలు చూడడం ద్వారా మనుషులే అలా తయారవుతున్నారో అర్థం కావడం లేదు. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న నేరాలకు సంబంధించిన ఘటనలు గురించి తెలిసి మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవుతున్న పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఏకంగా మనిషి ప్రాణాలను తీయడానికి వెనకాడని సాటి మనుషులు ఇక ఇలా ప్రాణాలు తీసిన తర్వాత పోలీసులకు దొరక్కుండా ఉండడానికి ప్లాన్లు వేస్తున్న తీరు మాత్రం పోలీసులకే షాక్ ఇస్తుంది అని చెప్పాలి.

 ఏకంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తలదన్నే విధంగా ఇటీవల కాలంలో ఎంతోమంది మర్డర్ కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్లాన్లు వేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. సాధారణంగా మీరు దృశ్యం సినిమాను చూసే ఉంటారు. అందులో పోలీసులకు దొరక్కుండా ఏకంగా హీరోగా ఉన్న వెంకటేష్ వేసే ఎత్తులు ప్రతిఒక్కరిలో కూడా ఉత్కంఠకు దారితీస్తూ ఉంటాయి. సినిమాలో ఉన్న ఎత్తులు పైఎత్తులు చూసి ఏకంగా ప్రేక్షకులు మునివేళ్లపై నిలబడతారు అని చెప్పాలి.

 కాగా ఇక్కడ  ఏకంగా దృశ్యం సినిమాను తలపించే క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ స్టోరీ ఒకటి వైరల్ గా మారింది. ఏకంగా ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన పాయల్ బాటి అనే 22 ఏళ్ళ యువతి ప్రియుడు అజయ్ తో కలిసి పారిపోవాలని భావించింది. ఇందుకోసం క్రైం త్రిల్లర్ సినిమా తరహాలో స్కెచ్ వేసింది.  తన లాంటి పోలికలు ఉండే మహిళతో స్నేహం చేసింది. ఇక ఆ తర్వాత సదరు మహిళను ఏకంగా ప్రియుడుతో కలిసి దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. అయితే తర్వాత ముఖం మొత్తం పెట్రోల్ పోసి కాల్చేసింది. ఇక తానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయింది. కానీ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో విచారణలో అసలు నిజం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: