ఓరి దేవుడా.. ఎలుక చిన్నారి ప్రాణం తీసింది?

praveen
కొన్ని రకాల ఘటనలను చూస్తూ ఉంటే విధి ఎంత కఠినమైనది అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో విధి మాత్రం కొన్ని కుటుంబాలను చిన్నచూపు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ కుటుంబంలో ప్రియమైన వారిని దూరం చేసి అందరిని అరణ్య రోజునలో మునిగిపోయేలా చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక అభం  శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా విధి కాస్త అయినా జాలి చూపకుండా ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఏకంగా ఒక ఎలుక కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చల్లా వారి పాలెం లో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పాలి. తాగునీటి బిందెలో ఎలుక పడి చనిపోయింది. దీంతో నీరు కలుషితం అయింది. అయితే చిన్నారి మాత్రం అది గమనించలేదు. దివ్య తేజ అనే ఆరేళ్ల చిన్నారి ఆ నీటిని తాగాడు. నీటిని తాగిన నిమిషాల వ్యవధిలోనే అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

 ఏకధాటిగా అతను వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. దీంతో ఏం జరిగిందో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. కానీ అతను నీళ్లు తాగిన బిందెలో చూస్తే ఎలుక చనిపోయి ఉన్నట్లు గమనించారు. దీంతో వెంటనే దివ్యతేజను గుంటూరు జి జి హెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందిన దివ్య తేజ చివరికి మృతి చెందాడు. ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో అరణ్య రోదనగా విలపించారు. ఇక తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కాస్తా స్థానికం గా సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rat

సంబంధిత వార్తలు: