తస్మాత్ జాగ్రత్త.. ప్రాణాలు తీస్తున్న పొగ మంచు?

praveen
వర్షాకాలం ముగిసింది. చలికాలం వచ్చేసింది. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న వర్షాలు దంచి కొట్టినట్లుగానే ఇక ఇప్పుడు చలి పులిలా అందరినీ భయపెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది అని చెప్పాలి. దీంతో ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు ఉదయం లేచి రెడీ అయి ఆఫీసుకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఎముకలు కొరికే చలి మధ్య ఇంటి నుంచి కాలు బయటపెట్టాలి అంటేనే వనికి పోతున్నారు. ఈ క్రమంలోనే కాస్త సాయంత్రం అయిందంటే చాలు ఇక చలి నుంచి తప్పించుకునేందుకు ఎన్నో రకాల దుస్తులు ధరిస్తూ ఉన్నారు.

 అయితే చలికాలం వచ్చింది అంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది పొగ మంచు అని చెప్పాలి. ఎందుకంటే ఉదయం లేవగానే ఎక్కడికక్కడ పొగ మంచూ నిండి  పోయి ఉంటుంది. ఇలా పొగ మంచు నిండిపోయిన సమయంలో ఎంతోమంది సంతోషంగా ఫీల్ అవుతూ ఆ పొగ మంచును ఆస్వాదిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇలా అందరి మనసును ఆహ్లాదపరిచే  పొగ మంచు ఏకంగా మనుషుల ప్రాణాలు తీసేస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా. పొగ మంచు ఏంటి మనుషుల ప్రాణాలు తీయడం ఏంటి అని అవాక్కవుతున్నారు కదా.

 నిజంగానే ఇక్కడ పొగ మంచు ఏకంగా మనుషుల ప్రాణాలు తీసేస్తూ ఉంది. ఇంతకీ ఎలా అంటారా.. ఉదయం సమయంలో ప్రయాణం సాగిస్తున్న వారు పొగ మంచు కారణంగా రహదారి సరిగ్గా కనపడకపోవడంతో చివరికి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కంసాన్పల్లి వద్ద నాందేడ్, అకోలా హైవేపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చోట పుల్కల్ మండలం తాడ్దాన్ పల్లి చౌరస్తా వద్ద బొలెరో, ఆటో  ఢీకొన్న ఘటనలో మరో ఇద్దరు చనిపోయారు. ఇలా చాలా ప్రాంతాల్లో పొగ మంచు మనుషుల ప్రాణాలను తీసేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: