చవతి సోదరిపై కన్ను.. చివరికి ఓ రోజు రాత్రి?

praveen
ఇటీవల కాలం లో వావి వరసలు మరిచి పోతున్న మనుషులు క్షణకాల సుఖం కోసం చేయకూడని నీచమైన పనులను చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే పరాయి వాళ్ళ విషయం లోనే కాదు సొంత వారి విషయం లో కూడా కాస్తైన మనుషుల్లా ప్రవర్తించడం లేదు. ఏకంగా చెల్లెలి వరస అయ్యే వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువగానే  వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. తద్వారా ఆడపిల్లల భద్రత రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. సవతి తల్లి కూతురు చెల్లి అన్న విషయాన్ని కూడా మరిచిపోయిన ఓ యువకుడు లైంగికంగా వేధించాడు. ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. రాజస్థాన్లోని జైపూర్ లో వెలుగు చూసింది ఈ ఉదంతం. శారీరక సంబంధానికి యువతి నిరాకరించడంతో చివరికి దారుణానికి పాల్పడ్డాడు యువకుడు. ఏకంగా సోదరిని చంపడానికి గొంతు కోశాడు. నిందితుడు  నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోదరుడు మాత్రమే కాకుండా సవతి తండ్రి కూడా తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదులు పేర్కొంది యువతి.

 జైపూర్ లోని ఓ కాలనీలో నివసిస్తున్న 22 ఏళ్ల తన సవతి  సోదరుడి నుంచి ఊహించిన విధంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఇటీవలే రాత్రి 10:00 సమయంలో ఆమె గదిలోకి ప్రవేశించిన సవతి సోదరుడు బలవంతంగా అత్యాచారం చేయబోయాడు..శారీరక సంబంధం కోసం బలవంతం చేశాడు. కానీ యువతి  నిరాకరించడంతో ఏకంగా ఇనుప వస్తువులతో గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పెద్ద గాయం కాకపోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇక మరుసటి రోజు ఉదయమే తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: