పండక్కి బట్టలు కొనివ్వలేదని.. కూతురు షాకింగ్ నిర్ణయం?

praveen
ప్రతి మనిషి నేటి రోజుల్లో ఆధునికన జీవనశైలిలోకి అడుగుపెడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడు.. ఎలాంటి సమస్య వచ్చినా ఇట్టే తన తెలివితో సాల్వ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి మాటలు నేటి రోజుల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ వాస్తవానికి వస్తే మాత్రం మనిషి ఆలోచన తీరు రోజురోజుకు మరింత బలహీనంగా మారిపోతుంది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్న మనిషి ఇక ఇప్పుడు మాత్రం చిన్న సమస్యలకే కృంగిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఏదైనా సమస్య వచ్చింది అంటే చాలు ఇక అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తున్నారు ఎంతోమంది.

 చివరికి ఇక తమ మీదే ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యుల గురించి పట్టించుకోకుండా బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అప్పుడప్పుడే ఎదుగుతున్న చిన్నారులు తల్లిదండ్రులు మందలించారని లేదా తమకు ఇష్టమైన వస్తువులు కొనివ్వలేదు అన్న కారణంతో ఆత్మహత్య చేసుకుంటూ ఉండడం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. బతుకమ్మ పండుగకు తల్లిదండ్రులు బట్టలు కొనివ్వలేదు అని చివరికి మనస్థాపంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరేపల్లి లో వెలుగు చూస్తుంది.

 గ్రామానికి చెందిన శంకరయ్య, శంకరమ్మ దంపతులు మేకలు కాస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్నారు. అయితే వీరికి 20 ఏళ్ల వనిత అనే కూతురు ఉంది. ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది. అయితే ఇటీవల బతుకమ్మ పండుగ కోసం కొత్త బట్టలు కొనాలని తల్లిదండ్రులతో గొడవ పడింది. అయితే ఇప్పుడు డబ్బులులేవని మరికొన్ని రోజుల్లో కొనిస్తాం అంటూ అటు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో ఎంతగానో మనస్థాపన చెందింది వనిత. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యమంలోనే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: