మగాళ్ళే చనిపోతున్నారు.. ఆ గ్రామంలో మిస్టరీగా మారిన మరణాలు?

praveen
సాధారణంగా ఆశ్చర్యకరమైన ఘటనలు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే తారసపడుతుంటాయ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలు కూడా కేవలం చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి అన్నది కొన్నిసార్లు అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తరువాత ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి.  సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో చావు పుట్టుక అనేది సర్వసాధారణం. ఒక మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు చనిపోతాడు అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది.

 సాధారణంగా అందరూ అనుకునేది అయితే వృద్ధాప్యంలో ముసలివాడుగా మారిన తర్వాత చనిపోతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే చావుకి ఆడ మగ అనే తేడా ఎక్కడా ఉండదు అని చెప్పాలి. ఎప్పుడు ఎవరి ఆయుష్షు తీరితే ఇక వారికి చావు సంభవిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు.  ఏకంగా ఆ గ్రామంలో మగవాళ్ళ తరచూ చనిపోతూ ఉండటం సంచలనంగా మారిపోయింది.  ఇదొక మిస్టరీగా మారిపోయింది అని చెప్పాలి.

 కేవలం ఒక్క ఆగస్టు నెలలోనే 15 మంది ఆ గ్రామంలో చనిపోయారు. చనిపోయిన వారిలో అందరూ మగవాళ్లే ఉండడం గమనార్హం. గత కొన్ని నెలల నుంచి అక్కడ 40 మంది చనిపోగా చనిపోయిన వారందరూ కూడా మగవాళ్లే కావడం గమనార్హం. ఇది ఎక్కడో జరగలేదు ఎన్టీఆర్ జిల్లా మాన్సింగ్ తండా లో జరిగింది. అక్కడ మగాళ్ళ మరణం మిస్టరీ గా మారిపోయింది. ఎక్కువగా కిడ్నీ సమస్యలతో  ప్రాణాలు కోల్పోతున్నారు. మొదట నొప్పులు కదల్లేని పరిస్థితి నుంచి తర్వాత కిడ్నీలు పాడవడం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే పెరిగిన మద్యం ధరల తో ఎక్కువ మంది నాటు సారా తాగడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని కొంతమంది స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: