పండగపూటే విషాదం.. పాపం ఏం కష్టం వచ్చిందో?

praveen
ఇటీవలి కాలం లో మనుషులు ప్రాణాలకు అసలు విలువ ఇవ్వడం లేదు. ఒకవైపు  మానవత్వం తో ఉండాల్సిన మనుషులు కాస్త వదులుగా మారి పోయి  ఏకంగా సాటివారి ప్రాణాలకు విలువ ఇవ్వకుండా దారుణం గా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. ఒక మనిషి ప్రాణాలు తీస్తే చివరికి జైలు కూడు తినాల్సి వస్తుంది అని ఎవరు భావించడం లేదు.  ఇదిలా ఉంటే ఒక వైపు హత్యలు జరుగుతుంటే మరో వైపు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా నేటి రోజుల్లో పెరిగి పోతూనే ఉంది అని చెప్పాలి.

 వెరసి క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం తో ఇక తల్లి దండ్రులకు తీరని కడుపుకోత మిగులు తుంది అని చెప్పాలి.  ఇటీవలే పండగపూట విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కంది  మండలం లోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో ఎంటెక్  చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ఉంటున్న రూమ్లోనే ఉరివేసుకొని చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇలా సూసైడ్ చేసుకున్న విద్యార్థి పేరు రాహుల్. అతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా గా  గుర్తించారు పోలీసులు.

 ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. రాహుల్ ఎంటెక్  రెండో సంవత్సరం చదువుతుండగా క్యాంపస్లోని 107 రూమ్ లో ఉంటున్నాడు. ఇటీవల అదే రూమ్ లో ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. దీంతో వెంటనే స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారూ.  అయితే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం ఇంకా తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: