ఓరి నాయనో.. పోలీసునే చంపితే.. కామన్ మ్యాన్ పరిస్థితేంటో?

praveen
సాధారణంగా పోలీసులు అంటే ఎప్పుడు ప్రజలకు రక్షణ కల్పిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజల కోసం పని చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇక సభ్య సమాజంలో నేరాలను అరికడుతూ  ఎప్పటికప్పుడు ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇక ప్రజలు కూడా పోలీసులు ఉన్నారు తమకు ఎలాంటి అపాయం రాదు అని గుండె మీద చేయి వేసుకుని నిద్ర పోతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూస్తూ ఉంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ప్రజలకు  రక్షణ కల్పిస్తూ నేరాలను అరికట్టే పోలీసులపై దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

 అయితే తమకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేకపోతే ఇక తమ పరిస్థితి ఏంటో అని ప్రతి ఒక్కరూ భయాందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఒక పోలీసు కానిస్టేబుల్ను పాత నేరస్తులు దారుణంగా పొడిచి చంపేశారు. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అని చెప్పాలి. నంద్యాల పట్టణంలో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. డీఎస్పీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉన్నాడు గూడూరు సురేంద్ర కుమార్.  ఇటీవలే ఆదివారం రాత్రి ఆఫీసు పనులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తున్నాడు.

 ఈ క్రమంలోనే రాజ్ థియేటర్ దగ్గరికి రాగానే పాత నేరస్తులు ఆ కానిస్టేబుల్ ను అడ్డగించారు. ఆ తర్వాత అతన్ని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని చిన్న చెరువు దగ్గరికి తీసుకువెళ్లి  కత్తులతో దారుణంగా పొడిచారు. తర్వాత అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.. అయితే కొనఊపిరితో కొట్టుకుంటున్న సురేంద్రను ఆటో డ్రైవర్ గమనించి అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా చివరికి చనిపోయాడు. అయితే సదరు కానిస్టేబుల్ ను ఎందుకు హత్య చేశారు అన్న కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: