పాములు పడితే రూ. 22 వేలు.. గిరాకి భలే ఉందే?

praveen
ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రం లో వర్షాలు  ఎంతలా దంచికొట్టాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. కుండ పోతగా కురిసిన వర్షాల నేపథ్యం లో ఇక రాష్ట్రం లోని ఎన్నో ప్రాంతాలు వరదల్లో చిక్కుకు పోయాయ్. ఈ క్రమం లోనే ఇక జనావాసాల స్తంభించి పోయాయి అన్న విషయం తెలిసిందే   అటు అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు మాత్రం వరదల కారణం గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వర్షాలు తగ్గు ముఖం పట్టిన నేపథ్యం లో ఇక ఆయా ప్రాంతాల్లో వరదలు కూడా తగ్గుతూ వస్తున్నాయ్.

 ఈ క్రమం లోనే వరదల కారణంగా పూర్తిగా బురద మయంగా మారి పోయిన ఇళ్లను ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్న  మయ్యారు అందరు. అయితే ఇటీవలి కాలం లో మంచిర్యాల్ లో వరదల నేపథ్యం  లో సరికొత్త సమస్య వచ్చింది. వరదల తో పాముల బెడద ఏర్పడటం తో పాములు పట్టే వారికి గిరాకీ పెరిగి పోయింది. ఇటీవలే వచ్చిన వరదల కారణం గా మంచిర్యాల పట్టణం గోదావరి తీరం లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం లోకి కుప్పలు తెప్పలుగా సర్పాలు కొట్టు కొచ్చాయి. ఇందులో విష సర్పాలు కూడా ఉండటం గమనార్హం.

 ఇటీవల వరదలు తగ్గడంతో బురదను శుభ్రం చేస్తుండగా పాములు బయటపడుతున్నాయి. ఇటీవలే ఆసుపత్రిలో బురద తొలగిస్తున్న సమయంలో ఓ మహిళను పాము కాటు వేయటంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆసుపత్రి అధికారులు పాములు పట్టే వారిని పిలిపించారు. ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు పాములను పట్టేందుకు పెద్దపల్లి జిల్లా కలవచర్ల కు చెందిన శ్రీనివాస్, బెల్లంపల్లికి చెందిన సంజీవ్ లకు 22,000 ఇచ్చేందుకు  ఒప్పుకున్నారు అధికారులు. ఇలా ఏకంగా పాముల బెడదతో పాములు పట్టేవారిని పిలిపించడం మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: