ఇద్దరు బురిడీ బాబాలు.. గుప్త నిధి పేరు చెప్పి.. ఏం చేశారో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే కొంత మంది జనాలు మాత్రం ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్ముతూ బురిడి బాబాలా చేతిలో మోసాలకు గురవుతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇటీవల కాలంలో నిధులు ఉన్నాయి అంటూ నమ్మిస్తూ ఎంతోమంది బురిడీ బాబాలు జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజుతు ఉన్నారు. ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది. ఇంట్లో పాతిపెట్టి  ఉన్న బంగారు నగలను బయటకి తీస్తాం  అంటూ నమ్మబలికి చివరికి భారీగా డబ్బులు గుంజారు ఇద్దరు కేటుగాళ్లు. బాధితులా ఫిర్యాదుతో వారిని అరెస్టు చేశారు పోలీసులు. ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో వెలుగులోకి వచ్చింది.

 కరీంనగర్ జిల్లా గన్నేరువరం కి చెందిన చందు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి కి చెందిన సంజీవ్ బాబాలు గా అవతారం ఎత్తారు. ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ లో రాజు వద్దకు వచ్చి మాయమాటలతో పరిచయం చేసుకున్నారు. మీ ఇంటికి భోజనానికి తీసుకెళ్తే అంతా శుభం జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే వీరిని ఇంటికి భోజనానికి తీసుకెళ్లాడు. అయితే ఇక ఇంట్లో పూజ గది ఉండటం చూసి ఏం జరిగింది అని ఆరా తీశారు. సోదరుడి కుమారుడు చనిపోవడంతో పూజలు చేయడం లేదు అంటూ రాజు సమాధానం చెప్పాడు. దీంతో ఇక ఇదే ఆసరాగా తీసుకున్నారు బురిడి బాబాలు.
 ఇంట్లో దయ్యం ఉందని అమావాస్య రోజు పూజ చేయక పోతే మరో దారుణం జరుగుతుందని చెప్పి ఏకంగా మూడు వేలు తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత కనిపించలేదు. అయితే వారిని కలిసి పూజ చేయాలని కోరగా 35,000 కావాలంటూ డిమాండ్ చేశారు. పది రోజుల తర్వాత మళ్లీ వచ్చి ఇంట్లో నాలుగు కోట్ల విలువైన నగలు ఉన్నాయని బయటకు తీయాలంటే ముందు పూజలు చేయాలని  దీనికోసం 1.80 లక్షల కావాలంటూ చెప్పారు. ఆ తర్వాత 7.5 లక్షలు వసూలు చేశారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరు కేటుగాళ్ళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: