అయ్యో పాపం..ఈ దొంగకు ఎంత కష్టం వచ్చింది..

Satvika
దొంగతనాలు చెయ్యడం చాలా కష్టం అని అంటున్నారు. అయితే వేరే ఆధారం లేకుండా పోయిన వాళ్ళు ఇక చెసెదెమి లేక ఇలా ఈజి మని కోసం అడ్డదారులు తొక్కుతున్నారు..కొందరు దొంగలు కోట్లు సంపాదిస్తే, మరి కొంత మంది మాత్రం దొంగతనానికి వెళ్ళి అడ్డంగా బుక్కయిన సంఘటనలు కూడా చాలానె వెలుగు చూస్తున్నాయి.. ఇటీవల కాలంలో కరోనా మిగిల్చిన పరిస్థితుల వల్ల చాలా మంది దొంగలుగా మారారు.. మొన్నీ మధ్య ఓ దొంగ దొంగతనానికి వెళ్ళి బెడ్ చూసి కునుకు తీసాడు. తెల్లారేసరికి హాయిగా పడుకున్నాడు. పోలీసులకు అప్పగించారు..


ఇప్పుడు మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. దొంగ దొంగతనానికి వెళ్ళి గోడ కర్ణంలో ఇరుక్కు పోయిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. గుడిలో దొంగతనానికి వెళ్ళి అక్కడ చేతికి దొరికిన వన్నీ దొచుకున్నాడు..అవన్నీ తీసుకొని బయటకు రావడానికి రెడీ అయ్యాడు. కానీ గుడికి ఉన్న కర్ణం గూండా బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. లోపల ఇరుక్కుని రాలేక పోయాడు.. మొత్తానికి అందరికి చిక్కారు.. ఉదయం గుడికి వెళ్ళిన భక్తులు అతణ్ణి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


వివరాల్లొకి వెళితే.. ఈ వింత ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కంచికి సమీపంలోని జడిపుడి గ్రామంలో పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి గాల జమ్మి గుడిలో దొంగతనానికి ప్రయత్నించాడు. తొలిత గోడకు ఓ వైపున చిన్న కన్నం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. అలా గోడలో నుండి గుడిలోకి బాగానే వెళ్లిన ఆ దొంగ.. హుండీలో ఉన్న కానుకలు చేత పట్టి ఈజీగా బయటకు రాలేకపోయాడు. మొదట బాగా సులువుగా వెళ్ళిన అతని,వచ్చే దానికి వీలులేదు చివరికి గోడలో సగంలో  ఇరుకున్నాడు. ఉదయం గుడికి వచ్చిన భక్తులు గమనించి దొంగని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: