బాబోయ్.. పూజ చేస్తుంటే పేలిన బైక్.. చివరికి?

praveen
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కొన్ని సార్లు ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయ్. ఇలాంటి ఘటనలు ఎంతోమంది అనుకోని షాక్ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక స్టైలిష్ బైక్ కొనుగోలు చేయాలని ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే డబ్బులు లేకపోయినా బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మరి బైక్ కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. ఇక ఇలా నేటి రోజుల్లో యువత ఎక్కువగా కొనుగోలు చేయాలనుకుంటుంది బుల్లెట్ బైక్. బుల్లెట్ బైక్ కొనుక్కుంటే ఎందుకో లెవెల్ పెరిగిపోతుంది అని భావిస్తూ ఉన్నారు చాలా మంది.

 అయితే పేద మధ్య తరగతి వారు సైతం బుల్లెట్ బైక్ కాస్త ఎక్కువ ధర ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా ఏకంగా ఆ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక ఇలా ఇష్టపడి బైక్ కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా సరే నేరుగా గుడి కి తీసుకెళ్ళి ఇక బైక్ కి ఏం జరగకూడదు అని పూజ చేయిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఓ యువకుడు ఇలాగే ఇష్టంగా బుల్లెట్ బైక్ కొనుక్కొని పూజ చేయించడానికి గుడికి తీసుకు వెళ్ళాడు. కానీ అందులో ఊహించని ఘటన అంతలోనే ఇష్టంగా లక్షలు పోసి అనుకున్న బుల్లెట్ బైక్ కాస్త నిమిషాల  వ్యవధిలోనే అగ్నికి ఆహుతి అయ్యి బూడిద లా మారిపోయింది.

 అనంతపురం జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం లో ఇక ఈ ఘటన జరగడం గమనార్హం. గుడి వద్ద బుల్లెట్ బైక్ కి పూజ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్ చెలరేగాయ్. అందరు చూస్తూ చూస్తూ ఉండగానే మంటలు చెలరేగి పోయాయ్. ఇక ఒక్కసారిగా బైక్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా బైక్ బ్లాస్ట్ అయ్యింది. దీంతో అక్కడ ఉన్న భక్తులందరూ కూడా భయంతో పరుగులు పెట్టారు. అయితే కొంతమంది ధైర్యం చేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో కళ్ళముందే లక్షలు పోసి కొన్న బుల్లెట్ బైక్ కాస్త అగ్నికి ఆహుతి అయింది.అయితే మంటలు ఎలా వచ్చాయి అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకపోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: