అమ్మాయిని కాపాడిన ఆటో డ్రైవర్..ఏం చేశాడంటే?

Satvika
కొందరు తమ స్వార్దాన్ని మాత్రమే చూసుకుంటారు.. మిగిలిన వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అని ఎవరికీ వారే అన్నట్లు ఆలొచిస్తారు.. అలాంటి ఈరోజుల్లో కూడా కొంతమంది మంచి తనాన్ని బయట పెడుతున్నారు.. ఎదుటి వారి రక్షణ కోసం ఆలొచిస్తున్నారు.. అలాంటి వారిలో ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఒకడు.. అతను ఒక అమ్మాయి ని సేఫ్ గా తన తల్లి దండ్రులకు అప్పగించాడు. అతను చేసిన పనికి పోలీసులు మెచ్చుకొని ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఈ విషయం సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడం  తో అందరూ అతణ్ణి అభినందిస్తున్నారు.

ఆటో డ్రైవర్‌ సమయస్ఫూర్తి తో వ్యవహరించడం తో పారిపోయిన ఓ బాలిక తిరిగి తన తల్లి దండ్రుల వద్దకు క్షేమంగా చేరుకుంది. ఈ ఘటన ఆదివారం జరిగింది. మహారాష్ట్ర రాష్ట్రం లోని పాలఘర్‌ లోని వసాయి రైల్వే స్టేషన్‌ వద్ద రాజు కర్వాడే అనే ఆటో డ్రైవర్‌ ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా, ఒక అమ్మాయి అతని వద్దకు వచ్చింది. అతని వద్దకు వచ్చి ఇక్కడ ఉండేందుకు మంచి గది అద్దెకు దొరుకుతుందేమోనని అడగ్గా, రాజు బాలిక కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు.

ఇంట్లో గొడవ పడి ఇక్కడకు వచ్చిందని మాటల్లో తెలుసుకున్నారు. తల్లి దండ్రుల తో గొడవపడి ఇంటినుంచి పారిపోయి వచ్చినట్లు తెలుసుకున్న ఆటో డ్రైవర్ ఆమెను అది ఇది చెప్థూ పోలీసు స్టేషన్ కు తీసుకెల్లాడు. అమ్మాయి తో పూర్తీ వివరాల ను తెలుసుకున్న పోలీసులు బాలికను గురించి సమాచారం అందించారు. బాలిక తల్లి ,దండ్రులకు సమాచారం అందించారు. బాలికను క్షేమంగా తల్లి, దండ్రులకు చేరవేయటం లో కీలకపాత్ర పోషించిన ఆటో డ్రైవర్‌ రాజు అభినందించారు. ఇది నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చెస్తున్నారు.. ఇలాంటి పనులు చేసి గొప్ప వాడు అనే పేరు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: