దారుణం: నెల్లూరులో అగ్ని ప్రమాదం... మహిళ సజీవ దహనం

VAMSI
ఒక్కోసారి మనకు తెలియకుండానే అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు చిన్న చిన్న ప్రమాదాల వలన క్షతగాత్రులు అవుతుంటారు. ఇలా అయితే పర్వాలేదు కానీ ప్రాణాలే పోతే, అప్పటి వరకు సజీవంగా ఉన్న వ్యక్తి అందరూ చూస్తుండగానే కాలి బూడిదైపోతే ఆ పరిస్థితిని కనీసం ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. అలాంటిది ఒక అనుకోని ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. అసలు ఏమి జరిగిందో పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం.
తెలంగాణ రాష్ట్రము హైద్రాబాద్ కు చెందిన మానసికంగా ఇబ్బంది పడుతున్న ఒక మహిళ ఆరోగ్యం బాగవుతుందని నమ్మి నెల్లూరు జిల్లాలోని ఏ ఎస్ పేట మండలంలో ఉన్న మసీదు దగ్గరకు వచ్చింది. అయితే అనుకున్న విధంగానే నిన్న రాత్రి అనగా గురువారం సదరు మహిళ అక్కడ ఉన్న మసీదు దగ్గరకు వెళ్ళింది. అయితే మతి స్థిమితం సరిగా లేని ఆ మహిళ తన చుట్టు పక్కల జరుగుతున్న దాని గురించి ఆలోచించలేకపోయింది. అలా అనుకోకుండా  అప్పటికే దర్గాకు దగ్గర సంభవించిన ఒక అగ్ని ప్రమాదంలో ఆమె మృతి చెందింది. అదే సమయంలో ఈమెకు సహాయంగా వచ్చినా మహిళ ఆమెను కాపాడడానికి వెళ్లి ఆ మంటల్లో చిక్కుకుంది.
కానీ అంత లోనే తేరుకుని బయటపడగల్గింది. దానితో సహాయంగా వచ్చిన మహిళ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాల బారిన పడింది. వెంటనే గాయపడిన మహిళను దగ్గలోని హాస్పిటల్ కు పంపినట్లు తెలుస్తోంది. మరణించిన మహిళను పోస్ట్ మార్టం కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన మహిళ ఫాతిమాగా స్థానికులు గుర్తించారు. అయితే దర్గా దగ్గర సంభవించిన అగ్ని ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ చనిపోవడానికి ఫాతిమా వచ్చినట్లుంది. అంతా విధి అనుకుని చుట్టుపక్కలవారు వెళ్లిపోయారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: