మత్తు మందు ఇచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని చంపి చచ్చిపోయింది...!

Gullapally Rajesh
నాగ్‌పూర్‌లో తన భర్త మరియు ఇద్దరు పిల్లలను చంపిన తరువాత తన ప్రాణాలను తీసుకున్న ఒక మహిళా డాక్టర్ తన కుటుంబ సభ్యులకు బలమైన మత్తు మందు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నాగ్‌పూర్ పోలీసులు డాక్టర్ సుష్మా రాణేను ఆమె నివాసంలో చనిపోయినట్లు గుర్తించారు. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త ధీరజ్ (42), వారి పిల్లలు పదకొండు  మరియు ఐదు సంవత్సరాల వయస్సు ఉన వారి మృతదేహాలను నాగ్‌పూర్‌ లోని కొరాడి ప్రాంతంలోని వారి ఇంటి వద్ద స్వాధీనం చేసుకున్నారు.
డాక్టర్ రాణే నగరంలోని అవంతి ఆసుపత్రి లో పని చేశారని అధికారులు పేర్కొన్నారు. పోలీసులు మంగళవారం ఈ కేసుకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. ఉదయం 6 గంటలకు స్కూటీలో తన కుమార్తెతో పాటు ఆసుపత్రికి వెళ్లి మత్తు మందును తెచ్చారని వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు వివరించారు. "ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, ఆమె తన భర్త మరియు ఇద్దరు పిల్లలకు మత్తుమందు అధిక మోతాదులో ఇంజెక్ట్ చేసి, ఆపై ఉరి వేసుకుంది" అని కొరాడి పోలీస్ స్టేషన్ అధికారి బుధవారం మీడియాకు వివరించారు.
"ధీరజ్ మరియు ఇద్దరు పిల్లల మృతదేహాలను కనుగొన్న గది నుండి పోలీసులు రెండు సిరంజిలను స్వాధీనం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంటి పెరటిలో మరొక సిరంజి మరియు అనస్థీషియా ఖాళీ సీసా కనుగొన్నామని పేర్కొన్నారు. కొన్ని ఖాళీ మద్యం సీసాలు కూడా ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ధీరాజ్ ఇంట్లో మద్యం సేవించే వాడని పేర్కొన్నారు. అవంతి హాస్పిటల్ వైద్యులు, మరియు ధీరాజ్ పనిచేసే కాలేజి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు, వీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తమకు తెలియదని చెప్పారు. ఫోరెన్సిక్ పరిక్షల తర్వాత వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించామని పోలీసులు మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: