పొట్లకాయ ఇలా ఎప్పుడన్నా వండరా..?

Suma Kallamadi
పొట్ల కాయ తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పొట్ల కాయ కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కాబట్టి సీజన్ సమయంలోనే పొట్ల కాయ కూర రుచిని ఆస్వాదించండి. పొట్ల కాయ పత్యం చేసేవారికి చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా పొట్లకాయ కూర ఎలా వండాలో చూద్దామా.ముందుగా కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దామా.. !
కావలిసిన పదార్ధాలు :
పొట్లకాయ ముక్కలు -ఒక కప్పు
ఉల్లి పాయ -ఒకటి చిన్నది
పచ్చి మిర్చి -1
ఆవాలు -అర టీ స్పూన్
జీలకర్ర -అర టీ స్పూన్
కరివేపాకు -కొద్దిగా
సాయి మినపప్పు -అర టీ స్పూన్
నూనె -రెండు చెంచాలు
ఉప్పు -తగినంత
పసుపు -చిటికెడు
కారం -1 టీ స్పూన్
పాలు -1 కప్
తయారీ విధానం:
ముందుగా పొట్లకాయ పై తోలు తీసేసి శుభ్రంగా కడికి రౌండ్ గా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి.ఆ తరువాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయండి. నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టండి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేపుకోవాలి.అవి వేగిన తరువాత గుండ్రంగా కోసుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకొవాలి.ఆ తరువాత ఉప్పు, పసుపు వేసి  బాగా కలిపి ఐదు  నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి.పొట్ల కాయ ముక్కలు మగ్గిన తరువాత కారం వేసి వేపాలి.కొద్దిసేపు అయ్యాక పాలు పోసి ఒకసారి తిప్పి మూత పెట్టేయండి.నూనె పైకి తేలేదాక ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కూర తినడానికి చాలా బాగుంటుంది. పొట్లకాయ కూర తినడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి రెండు మీ సొంతం అవుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: