యమ్మీ యమ్మీ అనిపించే మష్రూమ్, జీడిపప్పు ఫ్రై మీ కోసం.. !!

Suma Kallamadi
మష్రూమ్స్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు సూపర్ మార్కేట్ లలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు ఇవి లభిస్తున్నాయి.ఇవి  చాలా సున్నితంగా స్పాంజ్ లాగా ఉంటాయి. వీటిని నీటిలో వేసి కడిగితే విరిగిపోతాయి.అలాగే తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి.  కాబట్టి ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకుండా నీటిలో వేసి తీసేయాలి. లేదా పొడి బట్టతో సున్నితంగా తుడిచేయవచ్చు. పుట్టగొడులల్లో ఫ్రైబర్(పీచు)ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల మలబద్దకం లాంటి సమస్యలు దరిచేరవు.    అలాగే అధిక బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే పొటాషియం, మినిరల్స్ పుష్కలంగా ఇందులో ఉంటాయి. అందరు ఇష్టపడే ఈ మష్రూమ్స్ కి  జీడిపప్పు చేర్చి ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నం, చపాతి ల్లోకి బాగుంటుంది. ఇప్పుడు జీడిపప్పు మరియు మష్రూమ్స్ కర్రీ ఎలా చేస్తారో చూద్దామా.. !
కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్ 1 కప్పు,
జీడిపప్పు పది,
తరిగిన ఉల్లిపాయ 1,
 తరిగిన టమాటా 1,
 పచ్చి మిర్చి 1,
 అల్లం, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్,
కరివేపాకు కొద్దిగా,
ఆవాలు ¼ స్పూన్,
జీలకర్ర ½ స్పూన్,
నూనె సరిపడా,
 గరం మసాలా 1 టీ స్పూన్,
 ఉప్పు -తగినంత
కారం- తగినంత
పసుపు -తగినంత
తయారీ విధానం:  
ముందుగా  జీడిపప్పును ఒక పావు గంట పాటు నానపెట్టాలి. తర్వాత  స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్రకొద్దిగా కరివేపాకు  వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇలా ముందే అల్లం పేస్ట్ వేయడం వల్ల అల్లం పచ్చివాసన రాకుండా ఉంటుంది. అది వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి టమాటా ముక్కలు వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, గరం మసాలా వేసి ఒక  ఐదు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మష్రూమ్స్, జీడిపప్పు వేయాలి తర్వాత  సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిని సన్ననిమంటపై ఉడికించాలి.అసలు మంట ఎక్కువ పెట్టకూడదు.. ఎందుకంటే నీళ్లు పోయము కాబట్టి పాత్రకి అడుగు అంటుంది. దీని వల్ల కూర మాడిపోయిన వాసన వస్తుంది. సన్నని మంటపై ఉంచాలి.జీడిపప్పుని ముందుగానే నానబెట్టాము కాబట్టి త్వరగానే ఉడుకుతాయి. మష్రూమ్స్ కూడా మెత్తగా ఉంటాయి కాబట్టి నూనెలో వేగుతాయి.   కావాలనుకుంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.మష్రూమ్స్ పూర్తిగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి అంతే మష్రూమ్స, జీడిపప్పు ఫ్రై రెడీ.కొద్దిగా కొత్తిమీర జల్లుకుని తింటే భలే ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: