వెలగ పండుతో రుచికరమైన భేల్ ఇంకా జామ్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
వెలగపండు ఎంతో రుచికరమైన పండు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వెలగపండులో అనేక ఔషధ గుణాలు వున్నాయి.ఇక ఈ వెలగ పండుతో మనం రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు.. ఇక వెలగపండుతో రుచికరమైన భేల్ అలాగే రుచికరమైన జామ్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....


వెలగ పండు భేల్‌ కి కావలసిన పదార్ధాలు...


వెలగ పండ్లు - 4; పచ్చిమిర్చి - 10 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఉప్పు - తగినంత ; పంచదార - 4 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు; చాట్‌ మసాలా - ఒక టీ స్పూను; స్వీట్‌ చట్నీ- అర టీ స్పూను; గ్రీన్‌ చట్నీ- ఒక టీ స్పూను...


వెలగపండు భేల్ తయారు చేసే విధానం....


ముందుగా వెలగపండు భేల్ తయారు చేసేముందు వెలగపండ్లను పగలగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుని, గరిటెతో బాగా మెదపాలి.పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, పంచదార, కొత్తిమీర తరుగు, చాట్‌ మసాలా, గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ జత చేసి పప్పు గుత్తితో బాగా మెదపాలి. పగుల గొట్టిన వెలగ పండు చెక్కలలోనే అమర్చి అందిస్తే చూడటానికి అందంగా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన భేల్ ని మీరు ఇంట్లో తయారు చేసుకోండి...

వెలగ పండు జామ్‌ కి కావాల్సిన పదార్ధాలు....

వెలగ పండ్లు - 4; వేడి నీళ్లు - పావు లీటరు; పంచదార - 200 గ్రా.


వెలగపండు జామ్ తయారు చేసే విధానం...


వెలగ పండ్ల గుజ్జును ఒక పాత్రలో వేసి మెత్తగా మెదపాలి. వేడి నీళ్లు జత చేస్తూ బాగా కలియబెట్టాక, వడబోసి, గింజలను వేరు చేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక గుజ్జును అందులో వేసి బాగా కలపాలి. పంచదార జత చేసి బాగా కలియగొట్టి, పొంగులు వచ్చేవరకు ఉడికించాలి. పావు గంట తరవాత మిశ్రమం కొద్దిగా చిక్కబడుతుంది. ఒక ప్లేటులోకి తీసుకుని, కొద్దిగా చల్లారాక గాలి చొరని సీసాలో నిల్వ చేసుకోవాలి.ఇంకెదుకు ఆలస్యం మీరు ఇంట్లో ఈ ఐటమ్ తయారు చేసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: