పాకం గారెలు ఎప్పుడైనా ట్రై చేసారా...?

Sahithya
గారెలు...  మన తెలుగు ఇళ్ళల్లో ఏదైనా పండగ జరిగితే చాలు గారెలు అనేవి చాలా కీలకం. ఏదైనా చిన్న ఫంక్షన్  ఉన్నా సరే గారెలు లేకుండా అసలు ఏదీ జరిగే పరిస్థితి ఉండదు. గారెల కొస ముందుగానే చాలా జాగ్రత్తగా ప్రిపెర్ చేసుకుంటూ ఉంటారు.  అయితే గారేల్లో మాత్రం చాలా రకాలు ఉంటాయి. కాని చాలా మందికి ఆ రకాలు సరిగా  తెలియదు. గారెలు లేనిదే మన తెలుగు ఇళ్ళల్లో ఏ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. ఈ గారేల్లో ఉండే రకాలు కూడా చాలా మందికి తెలియదు. పాకం గారెల గురించి ఎప్పుడైనా విన్నారా...? తెలియదు కదూ... కాబట్టి మీకు ఈ రోజు స్పెషల్ పాకం గారెల గురించి చెప్తాను.
అసలు దానికి కావాల్సినవి ఏంటీ అంటే...  మినప్పప్పు – అర కేజీ కావాలి.  బెల్లం లేదా పంచదార – అర కేజీ కావాలి. ఇక  నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా వేయండి. యాలుకల పొడి – ఒక టీ స్పూను వేయండి. నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను మినప్పప్పును ముందు రోజు రాత్రి నాన పెట్టండి. ఆ మరుసటి రోజు ఉదయం, నీళ్లు ఒంపేసి, మినప్పప్పును గ్రైండర్‌ లో వేసి గట్టిగా రుబ్బండి. స్టౌ మీద నూనె కాగాక, పిండిని గారెల మాదిరిగా వేసుకుని, రెండు వైపులా ఎర్రగా కాలిన తరవాత కిచెన్‌ టవల్‌ మీదకు తీసుకోండి.
ఒక పెద్ద గిన్నెలో బెల్లం తురుము లేదా పంచదారకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చే వరకు కలుపుతు ఉండండి. యాలుకల పొడి, నెయ్యి జత చేసి మరోసారి కలిపి దించండి. వేయించి ఉంచుకున్న గారెలను ఈ పాకంలో వేసి సుమారు అర గంట సేపు ఉంచిన తరవాత తింటే, చాలా  రుచిగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: