మామిడి ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటాయో!

Durga Writes

మామిడికాయ.. పచ్చిది అయినా..  మాగినమామిడి పండు అయినా ఏది అయినా సరే ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మర్ సీజన్ ఫుడ్.. మామిడి ఫ్రైడ్ రైస్. అలాంటి సూపర్ ఫ్రైడ్ రైస్ గురించి అసలు మీకు తెలుసా? సాధారణంగా మామిడి పప్పు, మామిడి పులిహోర గురించి మనకు తెలుసు. మరి మామిడి ఫ్రైడ్ రైస్ అంటే ఏంటి? అది ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. మామిడి ఫ్రైడ్ రైస్ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

కావలసిన పదార్థాలు... 

 

పొడిగా వండిన అన్నం - 6 కప్పులు, 

 

మామిడి తురుము - 2 కప్పులు, 

 

పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు, 

 

పెసర మొలకలు - 2 కప్పులు, 

 

క్యారెట్ తరుగు - 2 కప్పులు, 

 

క్యాప్సికమ్ తరుగు - 2 కప్పులు, 

 

మినప్పప్పు - 4 చెంచాలు, 

 

నువ్వులు - 4 చెంచాలు, 

 

జీడిపప్పు - గుప్పెడు, 

 

శెనగపప్పు -  మినప్పప్పు 2 స్పూన్లు,  

 

ఆవాలు -1 చెంచా, 

 

కొత్తిమీర తరుగు - 4 చెంచాలు, 

 

జీలకర్ర - 1 చెంచాలు, 

 

పసుపు - అర చెంచా, 

 

పచ్చిమిర్చి - 10, 

 

నూనె - తగినంత, 

 

ఉప్పు - రుచికి తగినంత. 

 

తయారీ విధానం.. 

 

ముందుగా నువ్వులు, మినప్పప్పు వేయించి మిక్సి పట్టాలి. పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలపాలి. తరువాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, చెంచా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలపాలి. అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, ఉడికించిన పెసర మొలకలు వేసి మరికాసేపు వేయించి ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. అంతే మ్యాంగో రైస్ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: