హెరాల్డ్ స్పెషల్ కర్రీ: నోరూరించే గోబీ మాసాల స్పెషల్ కర్రీ మీకోసం...!

Suma Kallamadi

 చాలా మంది కాబేజీ, కాలి ఫ్లవర్[గోబీ ]  తో మంచురియాని బాగా ఇష్టపడి మరి తింటారు. కానీ క్యాలీఫ్లవర్, కాబేజీతో చేసిన కూరలు మాత్రం తినటానికి ఇష్టపడరు. అందుకే అలాంటి వాళ్ళకోసం ఒక మంచి రెసిపీ ఇది.  కాలి ఫ్లవర్ కి మసాలా పట్టించి కూర చేస్తే కాలీఫ్లవర్ ని పక్కన పెట్టిన వారు కూడా  ఎంతో ఇష్టంగా తింటారు.

 

కావలసిన పదార్ధాలు :

క్యాలీఫ్లవర్ - 1 పెద్దది,  గసగసాలు - 1/2 చెంచా, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 6 రెబ్బలు, పచ్చి కొబ్బరి తురుము - 1/2 కప్పు, ధనియాలు - 1/2 చెంచా, లవంగాలు - రెండు, జీలకర్ర - 3/4 చెంచా, దాల్చిన చెక్క - 1 1/2 ముక్క, జీడిపప్పు - తొమ్మిది, ఎండు మిరపకాయలు - ఆరు, ఉప్పు, పసుపు - సరిపడా.. కాలి ఫ్లవర్ పెద్దది 1, నూనె 4 పెద్ద స్పూన్లు, ఉల్లిపాయలు 4.

ముందుగా  ఉల్లి,వెల్లుల్లిని కలిపి ముద్దగా నూరాలి.తర్వాత  మిగిలిన మసాలాలు అన్ని కలిపి ఒక ముద్దగా రుబ్బాలి. 

తయారీ విధానం :

ముందుగా క్యాలీఫ్లవర్ పువ్వులు కట్ చేసి ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో ఒక పావుగంట నాననివ్వాలి. పావుగంట అయ్యాక నీటిలోంచి క్యాలీఫ్లవర్ పువ్వులను తీసి వాటికి  ముందుగా తయారుచేసుకున్న  మసాలలో సగం ముక్కలకు  పట్టించాలి. 

 

స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి కాగిన తర్వాత మిగిలిన మసాలా ముద్దను వేసి కొద్దిగా వేయించాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.  తర్వాత ఆందులోనే అరకప్పు నీరు పోసి దాంట్లో మనం మసాలా పట్టించిన క్యాలీఫ్లవర్ పువ్వులను వేసి కలబెడుతూ ఉడికించాలి.కారం చాలని వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు.  ఉడికిన తర్వాత  ఉప్పు చూసుకుని చాలకపోతే కొంచెం వేసుకోవాలి. నూనె పైకి తేలేదాక  ఉడికిస్తే రుచిగా ఉంటుంది కూర. ముక్కలు ఉడికిన తర్వాత   కొత్తిమీర చల్లండి. అంతే వేడి వేడి గోబీ కర్రీ తినండి మరి హర్రీ హర్రీగా. ఇది రోటి, పుల్కా ల్లోకి తింటే చాలా  బాగుంటుంది.ఒక్కసారి తింటే వదలరు సుమా... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: