ఉసిరి సాంబారు.. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?
తినడానికి పుల్లగా.. నోటికి రుచిగా ఉండే ఈ ఉసిరి సాంబారు ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటుంది.. అలాంటి ఈ సాంబారు ఎలా చెయ్యాలో చాలామందికి తెలియదు.. అలాంటివారు అంత ఈ ఉసిరి సాంబారు ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. అద్భుతమైన రుచిని ఆస్వాదించండి..
కావాల్సిన పదార్ధాలు..
ఉసిరికాయలు- ఆరు,
కందిపప్పు- కప్పు,
పసుపు- అరటీస్పూను,
సాంబారుపొడి- 2 టీస్పూన్లు,
పచ్చిమిర్చి- నాలుగు,
ఇంగువ- చిటికెడు,
ఉప్పు- తగినంత,
నూనె- టీస్పూను,
కొత్తిమీర తురుము- 2 టేబుల్ స్పూన్లు,
ఎండుమిర్చి- రెండు,
ఆవాలు- టీస్పూను,
కరివేపాకు- 2 రెబ్బలు,
తయారీ విధానం...
పచ్చిమిర్చిని నిలువుగా కోసి కందిపప్పుని మెత్తగా ఉడికించాలి. ఉసిరికాయల్ని కడిగి ముక్కలుగా కోసి గింజలు తీసి, మెత్తగా ఉడికించాక అందులోనే పసుపు, పచ్చిమిర్చి వేసి మెదపాలి. తరవాత ఈ ముద్దను ఉడికించిన కందిపప్పులో వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు, సాంబారు పొడి వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు తాలింపు దినుసులతో పోపు చేసి సాంబారులో కలిపితే సరి. రుచి అద్భుతంగా ఉంటుంది.