జిమోకి వైఫై డబ్బా షాక్..!

Edari Rama Krishna

ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలతో రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. అంతేకాదు జియో మార్గంలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ నడవాల్సిన పరిస్థితులు కూడ అనివార్య పరిస్థితులను కల్పించింది జియో.  డేటా, వాయిస్ కాల్స్ తో పాటు ఫీచర్ ఫోన్‌ పేరుతో అతి చౌకగా ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది జియో.  జియో కాంపిటీషన్ తట్టుకోవడానికి ఇదే బాటలోనే ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్‌లు కూడ కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి.


తాజాగా ఇప్పుడు జియోకి షాక్ ఇస్తు..బెంగళూరు నగరంలో ఐఎస్‌పీ లైసెన్స్‌తో ఫైబర్‌ ఆప్టిక్స్‌ ద్వారా డేటా సేవలు అందిస్తున్న వైఫై డబ్బా జియో ప్లాన్లతో  నియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రీ పెయిడ్‌ కస్టమర్లకు సరసమైన ధరల్లో డేటా ప్లాన్లను ఆఫర్‌ చేస్తోంది.  జియో రూ.19 లపై 150 ఎంబీ  అందిస్తోంటే.. కేవలం రూ.2లకే 100 ఎంబీ డేటా ఆఫర్‌ చేస్తోంది.  అలాగే రూ.10లకే 500ఎంబీ,  రూ.20లకు 1 జీబీ డేటా అందిస్తోంది.   టెలికాం కంపెనీల్లాగా లక్షలు ఖర్చుపెట్టి  సెల్‌ టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా.. రూ. 4వేలతో ఒక డబ్బా(రౌటర్‌) ద్వారా తమ సేవలను విస్తరిస్తోంది. 


అతి తక్కువ ఖర్చుతో అతి వేగవంతమైన డేటా  అందించడమే తమ లక్ష్యమని వైఫై డబ్బా ఫౌండర్‌ శర్మ చెబుతున్నారు.  ఇప్పటికే  బెంగళూరు నగరంలో 350రౌటర్‌ లేదా డబ్బాలను అమర్చగా... ఇం​కా 1800 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయట. ప్రస్తుతం స్థానిక్‌ కేబుల్‌ ఆపరేటర్ల భాగస్వామ్యంతో ఈ సేవలను అందిస్తోంది.  అలాగే రాబోయే  3-4 ఏళ్లలో లక్షల వైఫై డబ్బాలను ఏర్పాటు చేయాలని  యోచిస్తున్నట్టు చెప్పారు.  కాగా  వైఫై  డబ్బాకి ప్రస్తుతం వై కాంబినేటర్‌  సహా కొన్ని సంస్థలు  ఇన్వెస్టర్లుగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: