భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. వాళ్లకు భారీ నష్టాలు ఖాయమా?
దీపావళి పండుగ సమయంలో బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఆ సమయంలో బంగారం,వెండిపై ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపించారు. మరి కొందరు బంగారంపై ఊహించని మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాల వల్లే బంగారం, వెండి ధరలు తగ్గాయని సమాచారం అందుతోంది.
అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర 4,000 డాలర్ల స్థాయి దిగువకు చేరింది. అమెరికా చైనా మధ్య త్వరలో ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉండటం కూడా బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అక్టోబర్ నెల 30వ తేదీన ట్రంప్, జిన్ పింగ్ మధ్య చర్చలు జరగనుండగా ఆరోజు కీలక ప్రకటన వెలువడనుందని సమాచారం అందుతోంది. ఈ కారణాల వల్లే పుత్తడికి డిమాండ్ తగ్గుతోందని సమాచారం అందుతోంది.
అంతర్జాతీయ ధరల ఆధారంగా దేశీయ మార్కెట్లో సైతం బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 22 వేల రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర లక్షా 12 వేల రూపాయలుగా ఉంది. ఒక్క రోజులోనే బంగారం ధర 2,000 రూపాయలు తగ్గడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు వెండి ధరలు సైతం ఊహించని స్థాయిలో తగ్గముఖం పట్టాయి.
హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,48,000 రూపాయలుగా ఉంది. కొన్ని రోజుల పాటు బంగారంపై పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు