మన దేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లో ఇష్టపడే జనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు ఈ బైక్స్ ఇండియాలో చాలా తక్కువగా అమ్ముడుపోయేవి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ చాలా ఎక్కువ శాతం అమ్ముడుపోతున్నాయి. దానితో అనేక ప్రాంతాలలో కొత్త కొత్త షోరూమ్స్ ను కూడా ఈ కంపెనీ వారు ఓపెన్ చేస్తున్నారు. ఎక్కువ శాతం యువత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దానితో ఈ కంపెనీ వారు కూడా కొత్త కొత్త మోడల్స్ ను సరికొత్త లుక్ లో జనాల ముందుకు తీసుకువస్తూ వారిని మరింత ఆకర్షిస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఎన్ఫీల్డ్ సంస్థ వారు మరో కొత్త బైక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 ను తాజాగా ఈ కంపెనీ వారు మార్కెట్లోకి లాంచ్ చేశారు. దీని ధరను కంపెనీ 3 లక్షల 39 వేల రూపాయలుగా నిర్ణయించారు. చెన్నై నుండి ఈ బైక్స్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల నుండి డెలివరీలు కూడా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ బైక్ లుక్ విషానికి వస్తే ముందు వైపు 19 అంగుళాల స్పోకుడ్ వీల్స్ మరియు వెనుక వైపు 17 అంగుళాల వీల్స్ తో ఈ బైక్ రానుంది. ఈ బైక్ లో కంపెనీ వారు ట్యూబ్ లెస్ టైర్స్ ఇవ్వలేదు. ముందు.వైపు 320 ఏం ఏం డిస్క్ మరియు వెనక వైపు 270 ఏం ఏం డిస్క్ బ్రేక్ లను కంపెనీ ఇచ్చింది.
ఇక ఈ బైక్ బరువు విషయానికి వస్తే ఇది 216 కిలోల బరువుతో ఉండబోతుంది. ఇలా ఈ బైక్ ను అదిరిపోయే లుక్ లో కంపెనీ జనాల ముందుకు తీసుకురానుంది. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ బైక్ లవర్స్ నుండి లభిస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతానికి మాత్రం యువత ఈ బైక్ ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి లంచ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.