భారత వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా కన్నుమూత..!

Amruth kumar

భారతీయ ప్రముఖ పారిశ్రామిక వేత్త  రతన్ టాటా కొద్దిసేపటి క్రితమే మరణించారు .. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యల తో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు . రెండు రోజుల క్రితం ముంబై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చేరిన రతన్ టాటా ను ఐసీయూలో ఉంచి చికిత్సస అందించారు . డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఆయన మరణించినట్టు తెలుస్తుంది .
ఇక రతన్ టాటా మరణం పై టాటా సెన్స్ చైర్మన్ ఇన్ చంద్రశేఖరన్‌ కూడా స్పందించారు .. రతన్ నావల్ టాటా కు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాము. టాటాకు మాత్రమే కాకుండా ఎంతో మందికి సహకారం అందించిన స్ఫూర్తి దాతత ఆయన .. మన దేశం గర్వించ ద‌గ్గ‌ అతికొద్ది పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు . టాటా గ్రూప్ కి టాటా చైర్ పర్సన్స్ కంటే ఆయనే ఎక్కువ . ఆయన మాకు కేవలం గురువు మాత్రమే కాదు గొప్ప మార్గదర్శకుడు మంచి స్నేహితుడు. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాము ..
తిరుగులేని నిబద్ధత, అంకిత భావం కారణంగా ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ ఈ స్థాయికి విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన తనదైన ముద్రవేశారు. ఆయన సూచించిన మార్గంలో నేను నడుస్తాను. ఎన్నో లక్షల మందికి జీవితం ఇచ్చారు. చదువు నుంచి ఆరోగ్యం వరకు ఆయన చేసిన కార్యక్రమాలు అలాగే నిలిచిపోతాయి. రాబోయే తరాలు సైతం రతన్ టాటాన స్మరించుకుంటాయి. టాటా కుటుంబం తరపున, రతన్ టాటా సన్నిహితులు, ఇష్టమైన వారికి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి. ఆయన వారసత్వా్న్ని కొనసాగిస్తానని’ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఓ భావోద్వేగ లేఖను విడుదల చేశారు.ఆయన మరణం పై దేశ ప్రధాని నుంచి ప్రతి ఒక్కరూ సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: