ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఫెస్టివ్ డేస్ సేల్ ఆఫర్స్ ఇవే

frame ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఫెస్టివ్ డేస్ సేల్ ఆఫర్స్ ఇవే

Suma Kallamadi
ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వస్తువును కొనాలి అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ ను సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి చిన్న వస్తువుకు బయటికి వెళ్లే పని లేకుండా ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా ఇంటికి డెలివరీ అయ్యే విధంగా అన్ని రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండడంతో అందరూ కూడా వీటిపైనే ముగ్గు చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అయిన ఫ్లిప్‌కార్టు , అమెజాన్ లాంటి కంపెనీలు వినియోగదారుల కోసం మరెన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ఇక పండుగల సమయంలో అయితే బంపర్ ఆఫర్లు అంటూ వినియోగదారులను ఆకర్షించే విధంగా ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటారు. ఇక ప్రతి సంవత్సరం ఫ్లిప్‌కార్టు భారీ సేల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా వినియోగదారుల అందరూ కూడా స్మార్ట్ ఫోన్లో పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఈ సేల్ దాదాపు వారం పాటు కొనసాగుతుంది. ఈ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమై అక్టోబర్ 15న ముగిస్తుంది.
అయితే  ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులు అనంతరం రెండవ సేల్ మొదలు అవుతుంది. ఈ సేల్  లో వినియోగదారులకు మంచి ఆఫర్స్ లభిస్తాయి. బిగ్ బిలియర్ డే సేల్స్ ను వినియోగించని వారు తదుపరి సేల్ అయినా ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఫెస్టివల్ డేస్ సేల్ ను  వినియోగించుకుంటారు. ఈ సేల్  16 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమై 20 అక్టోబర్ 2024 వరకు కొనసాగుతుంది.

ఈ సెల్ లో భాగంగా భారీగా డిస్కౌంట్ లను అందించడంతోపాటు ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు,  ఇలా మరెన్నో ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్స్, క్యాష్ బాక్స్ ఇస్తూ ఉంటారు. ఇక ఈ ఆఫర్లో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దాదాపు అన్ని ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ ఆఫర్లు , బ్యాంక్ డిస్కౌంట్ ప్రయోజనాన్ని కూడా కస్టమర్స్ పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ విలువ మాత్రం మన పాత ఫోన్ స్థితిపై ఆధార పడి ఉండడంతో పాటు ఫోన్ మోడల్ , ఫోన్ పనితీరు పై ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: