వాట్సాప్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్

frame వాట్సాప్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్

Suma Kallamadi
ఈరోజుల్లో ఫోన్‌ను చాలా జాగ్రత్తగా వినియోగించాలి. మెట్రో, ఆఫీసు, పబ్లిక్ ప్లేస్‌లల్లో ఫోన్ వాడేటప్పుడు కొన్నిసార్లు సీక్రెట్ అవసరం. పక్కవారు ఫోన్ చూడకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. అలా పక్కవారు మన ఫోన్‌ను చూడకుండా చేసేందుకు ఇప్పటి వరకూ ఏ ఫీచర్ లేదు. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ఓ సీక్రెట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది వాట్సాప్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వాట్సాప్‌కు మెసేజ్ వచ్చిందనే నోటిఫికేషన్‌ను ఇప్పుడు ఎవ్వరూ చూడకుండా చేయొచ్చు. అయితే ఇందుకోసం మీ ఫోన్‌లో ఓ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి కిందికి స్క్రోల్ చేస్తే యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యాప్స్‌పై క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే వాట్సాప్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వాట్సాప్‌పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత నోటిఫికేషన్‌లకు వెళ్తే మూడు గుర్తులు కనిపిస్తాయి. అన్ని ఫోన్లలో డిఫాల్ట్‌ ఆప్షన్ ఉంటుంది. ఆ మూడు ఆప్షన్లపై డిఫాల్డ్‌ను నిలిపివేయాలి. అలా చేసిన తర్వాత వాట్సాప్‌కు మెసేజ్ వచ్చినప్పుడల్లా ఫోన్లో వైబ్రేషన్ వస్తుంది. లేకుంటే సౌండ్ కానీ వస్తుంది. అయితే డిస్ ప్లేలో నోటిఫికేషన్ మాత్రం కనపడదు.  
ఇకపోతే వాట్సాప్‌లో చివరగా ఏ టైం వరకూ ఉన్నారనే దానిని కూడా సెట్టింగ్‌తో మార్చవచ్చు. మీరు ఆఖరిసారి వాట్సాప్‌లో ఏ టైంలో ఉన్నారనే విషయం తెలియదనుకుంటే వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మై కాంటాక్ట్స్ లేదా నోబడీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లూ టిక్‌ను తీసేయొచ్చు. అలాగే అవతలి వ్యక్తి మీ మెసేజ్‌ను చదివినట్లు తెలియాలంటే బ్లూ టిక్ పడుతుంది. ఆ బ్లూ టిక్ ఎవరికీ తెలియకూడదనుకుంటే వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీపైన క్లిక్ చేయాలి. అక్కడ రీడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆఫ్ చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: