ఇండియాలో అత్యంత ఖరీదైన టాప్-5 ఇళ్ళు వీళ్ళవే?

Purushottham Vinay
ఇండియాలో అత్యంత ఖరీదైన టాప్-5 ఇళ్లను గమనిస్తే..ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లుగా ఆసియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ యాంటిలియా, రూ.12,000 కోట్ల అంచనా ధరతో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా నిలిచింది. ఈ నివాసంలో చాలా ఖరీదైన వస్తువులు కూడా ఉన్నాయి.ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న యాంటిలియా.. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశంలోని అత్యంత ఖరీదైన హౌస్. ఈ 27-అంతస్తుల భవనం 9 హై-స్పీడ్ ఎలివేటర్లు, 3 హెలిప్యాడ్‌లు, ఒక ఐస్ క్రీం పార్లర్, సినిమా థియేటర్, సెలూన్, జిమ్‌లను కలిగి ఉంది. ఇది భూకంపాలను 8 తీవ్రతతో తట్టుకోగలదు. 600 మంది సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు.ఇక భారతదేశంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు జేకే హౌస్. రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియాకు చెందిన ఈ జేకే హౌస్ విలువ సుమారు ₹6000 కోట్లు. సౌత్ ముంబైలో ఉన్న ఈ 30-అంతస్తుల బిల్డింగ్ ఆధునిక డిజైన్ అద్భుతంగా ఉంటుంది. దీనిలో రెండు స్విమ్మింగ్ పూల్స్, హై-ఎండ్ కార్లను పార్కింగ్ చేయడానికి ఐదు అంతస్తులు ఉన్నాయి.


ఇక భారతదేశపు మూడవ అత్యంత ఖరీదైన ఇల్లు అబోడ్, ఇది అనిల్ అంబానీ ఇల్లు. దీని ఖరీదు కూడా దాదాపు 6 వేల కోట్లు ఉంటుంది.ఇండియాలో మూడవ అత్యంత ఖరీదైన ఇల్లుగా, 16,000 చదరపు అడుగుల విస్తీర్ణం, హెలిప్యాడ్‌తో 70 మీటర్ల ఎత్తులో ఉంది. ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న ఈ 17-అంతస్తుల భవనం గతంలో ముఖేష్ అంబానీ, అతని కుటుంబం యాంటిలియాకు వెళ్లడానికి ముందు వారి ఇల్లుగా ఉండేది. గ్రాండ్ వెల్ కమ్ చేప్పే ప్రవేశద్వారం, అద్భుతమైన గ్లాస్ కిటికీలను ఈ ఇల్లు కలిగి ఉంటుంది.ఇక నాలుగవ స్థానంలో కేఎం బిర్లాకు చెందిన జతియా హౌస్ భారత్ లో ఖరీదైన ఇళ్లలో ఒకటిగా ఉంది. దీని విలువ దాదాపు రూ. 425 కోట్లు.ఈ ఇల్లు 30,000 చదరపు అడుగుల విస్తిర్ణంలో ఉంటుంది.ఇండియాలో అత్యంత ఖరీదైన ఐదవ ఇల్లుగా మన్నత్ నిలిచింది. ఇది షారుక్ ఖాన్ ఇల్లు. ముంబైలోని బాంద్రా వెస్ట్ లో ఉన్న ఈ ఆరు అంతస్తుల ఈ భవనం విలువ దాదాపు 200 కోట్ల రూపాయలకు పైనే. 27000కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంటుంది. ఫేమస్ ఆర్కిటెక్ట్ రాజీవ్ పరేఖ్ 2016లో దీనిని పునరుద్ధరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: