పర్సనల్ లోన్స్ పై ఆందోళన పడుతున్న RBI?

Purushottham Vinay
ఇక ఈమధ్య అత్యధిక మొత్తాలతో పర్సనల్ లోన్స్ తీసుకుంటున్న వారి సంఖ్యతో పాటు పర్సనల్ లోన్స్ సంఖ్య పెరుగుతున్నట్లు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుర్తించింది. ముఖ్యంగా కొన్ని పర్సనల్ లోన్ వృద్ధి వేగంగా పెరుగుతుండగా దానిపై ఆర్‌బీఐ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాలను జారీ చేసే ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు ఇంకా ఇతర రుణదాతల (NBFCs)ను ఆర్‌బీఐ హెచ్చరించింది. ఈ లోన్స్‌ను జాగ్రత్తగా మానిటర్ చేయాలని కూడా RBI సూచించింది.అలానే వీటిని స్వయంగా పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపింది.RBI గవర్నర్ శక్తికాంత దాస్  మాట్లాడుతూ.. 'కొన్ని రకాల వ్యక్తిగత రుణాలు అనేవి చాలా వేగంగా పెరుగుతున్నాయి. సమస్యల సంకేతాల కోసం వాటిని నిశితంగా గమనిస్తున్నాం' అని ఆయన అన్నారు. బ్యాంకులు, ఇతర రుణదాతలు ఈ రుణాల విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, స్ట్రాంగ్‌ రిస్క్ మేనేజ్‌మెంట్, పూచీకత్తు ప్రమాణాలను కలిగి ఉండాలని కూడా ఆయన అన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా కనుక ఉండకపోతే రుణగ్రహీతలు బ్యాంకులు ఇంకా ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్‌కు ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు.ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మొత్తం కొత్త బ్యాంక్ లోన్‌లలో వ్యక్తిగత రుణాలే ఏకంగా 37.7% వాటా కలిగి ఉన్నాయి.


పైగా ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే భారీ పెరుగుదల. వ్యక్తిగత రుణాలలో, క్రెడిట్ కార్డ్ లోన్స్ అనేవి 30% వేగంగా వృద్ధి చెందాయి, వాహన రుణాలు 21% ఇంకా గృహ రుణాలు 14% వద్ద ఉన్నాయి. బ్యాంకు క్రెడిట్ టోటల్ కంపోజిషన్ కూడా కాలక్రమేణా మారిపోయింది, ఇప్పుడు పరిశ్రమల కంటే సేవలు ఇంకా రిటైల్ రంగాలకు ఎక్కువ రుణాలు లభిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్ ఎఫెక్ట్ ని చూపించాయి. ఇక ఇది జీడీపీ వృద్ధిని పెంచడంలో కీలక పాత్రని పోషించింది. మొత్తం మీద ఆర్‌బీఐ ఈ మార్పు పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది.ఇక వివిధ రకాల రుణదాతల కోసం అంబుడ్స్‌మెన్ (కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడంలో సహాయపడే వ్యక్తులు) ఎలా పని చేయాలనే దాని కోసం ఆర్‌బీఐ ఒకే నిబంధనలను కూడా ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం బ్యాంకులలోని అంబుడ్స్‌మెన్లు, ప్రీపెయిడ్ పేమెంట్ టూల్స్ జారీ చేసే నాన్-బ్యాంక్ ఉద్యోగులు ఇంకా NBFCs & క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల కోసం వేర్వేరు నియమాల సెట్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ నియమాలు ఒకే విధంగా ఉంటాయి, కానీ అవి పనిచేసే విధానంలో మాత్రం కొన్ని తేడాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RBI

సంబంధిత వార్తలు: