ఇక అదానీ షేర్లు.. బంగారు బాతుగుడ్లేనా?
అయితే ఆదాని కంపెనీ లకు అప్పనంగా దోచి పెడుతున్నారని దీనికి కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని హిండెన్ బర్గ్ నివేదిక కొన్ని సంచలన విషయాలను బయట పెట్టింది. దీని వల్ల ఆదాని కంపెనీ ల షేర్లు పడిపోయాయి. లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. అపుడు ఎల్ ఐ సిలో కూడా ఆదాని కంపెనీల పెట్టుబడులు ఉన్నాయని దాని పని కూడా అయిపోయింది అని తెగ ప్రచారం చేశారు.
ప్రస్తుతం ఆదాని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తూ పరుగులు పెడుతున్నాయి. అపుడు షేర్లు పడిపోవడానికి కారణం మనలోనే కొంతమంది ఆదాని పై పెంచుకున్న ఈర్ష ద్వేషం కారణం అయ్యాయి. వేధింపుల వల్ల చాలా మంది పారిశ్రామిక వేత్తలు ఇండియా లో కంటే విదేశాల్లో వ్యాపారం బాగా ఉంటుందని అక్కడ పరిశ్రమలు ప్రారంభించి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇండియాలో ఏదైనా పరిశ్రమ దూకుడుగా వ్యవహరిస్తుందంటే దానిపై రైడ్స్ జరుగుతాయి. లేకపోతే లేని పోనీ నిందలతో వాళ్ళ వ్యాపారాలు దెబ్బ తీయడమే కాకుండా.. షేర్లు పడిపోయి ఇతరులు కూడా ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. కాబట్టి ఇండియాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తే ఎంతో మందికి ఉద్యోగాలు దొరికి వారి జీవితాలు బాగుపడతాయి. ఆదాని గ్రూప్ షేర్లు మళ్లీ పుంజుకోవడంతో మదుపరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.