గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు?

Purushottham Vinay
దేశంలో అధిక ధరల కారణంగా సామాన్య ప్రజల జేబుకు చిల్లులు పడుతున్నాయి. అయితే సామాన్యులకు ఇప్పుడు చక్కటి తీపికబురు అందింది. ఎందుకంటే వంట నూనె ధరలు తగ్గి దిగి వచ్చాయి.ఫారెన్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు తగ్గడంతో ఇండియన్ మార్కెట్‌లో కూడా ఆయిల్ ధరలు తగ్గాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక ఇది ప్రజలకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.స్థానిక మండీలలో ఆయిల్ ఇంకా అలాగే ఆయిల్ సీడ్ రేట్లు తగ్గాయి. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గడం వల్ల దేశంలోకి తక్కువ ధరకే ఆయిల్ అనేది దిగుమతి అవుతోంది. దీని వల్ల వంట నూనె ధరలు దిగి వస్తున్నాయని సమాచారం తెలుస్తోంది.నవంబర్ నెల నుంచి మార్చి కాలంలో వంట నూనె దిగుమతులు వార్షికంగా ఏకంగా 23.7 శాతం మేర పెరిగడం జరిగింది.మొత్తం 6.98 మిలియన్ టన్నులుగా నమోదు అయ్యాయి. పామ్ ఆయిల్ ధర వార్షికంగా చూస్తే ఏప్రిల్ నెలలో 42 శాతం పడిపోవడం జరిగింది. టన్నుకు మొత్తం 1791 డాలర్ల నుంచి 1030 డాలర్లకు దిగి వచ్చింది.ఇంకా అలాగే క్రూడ్ సోయాబీన్ ఇంకా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు కూడా వరుసగా 45 శాతం, 53 శాతం చొప్పున తగ్గడం జరిగింది. ఇవి వరుసగా టన్నుకు 1040 డాలర్లకు ఇంకా 1010 డాలర్లకు దిగి వచ్చాయి.ఈ ధరల తగ్గుదల నేపథ్యంలో అధిక దిగుమతులు కారణంగా ఇండియన్ మార్కెట్‌లో కూడా మస్టర్డ్, సోయాబాన్ సీడ్ రేట్లు తగ్గాయి.


దేశంలోని ఫేమస్ ఆయిల్ సమాఖ్య ఎస్ఓపీఏ ప్రకారం చూస్తే.. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకారం మస్టర్డ్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తుంది.అలాగే దేశంలో కొన్ని మార్కెట్లలో చూస్తే మస్టర్డ్ ఆయిల్ ధర కనీస మద్దతు ధర కన్నా కూడా తక్కువగానే ఉంది.ఇక మస్టర్డ్ ఆయిల్ రేటు ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 5 వేల నుంచి రూ. 5100 దాకా ఉంది. రూ.5450 మద్దతు ధర కన్నా ఇది తక్కువనే చెప్పాలి. వేరు శనగ నూనె ధర అనేది క్వింటాల్‌కు రూ. 6805 నుంచి 6865 వద్ద ఉంది. వేరుశనగ రిఫైన్డ్ ఆయిల్ ధర వచ్చేసి టిన్‌కు రూ. 2540 నుంచి రూ. 2805గా ఉంది.అలాగే పామోలిన్ ఎక్స్ కాండ్లా ధర క్వింటాల్‌కు రూ. 9400గా కొనసాగుతోంది. ఇంకా సోయాబీన్ ఆయిల్ డిగుమ్ కాండ్లా ధర క్వింటాల్‌కు రూ. 9 వేలు వద్ద ఉంది. పామోలిన్ ఆర్‌బీడీ క్వింటాల్ ధర వచ్చేసి రూ. 10,250గా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గడం వల్ల ఆ ప్రభావం మన మార్కెట్‌పై గట్టిగా పడుతోంది. అందువల్ల రానున్న కాలంలో కూడా వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: