కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో OPS బెనిఫిట్స్?

Purushottham Vinay
ఇక రీసెంట్ గా డీఏ పెంపు శుభవార్త అందుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తుండగా తమకు కూడా ఇక పాత పెన్షన్ విధానమే కావాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హడావిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పెన్షన్ విధానంలో కీలక మార్పులు చేసి.. ఉద్యోగులకు మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ పాత పెన్షన్ స్కీమ్‌ విధానం అమలు చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పాత పెన్షన్ విధానమే అమలు చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కూడా చాలా ఒత్తిడి పెరిగింది.ఇక ఈ కొత్త పెన్షన్ స్కీమ్‌లో గ్యారెంటీడ్ రిటర్న్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది.


ఇక ఇందులో కొత్త పెన్షన్ స్కీమ్‌లోనే ఉద్యోగులు పాత పెన్షన్‌ను పొందేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ కొత్త పెన్షన్ స్కీమ్‌లో కూడా కనీస హామీ పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు ప్రభుత్వం తన సహకారాన్ని మొత్తం 14 శాతానికి పైగా పెంచాలని ప్లాన్ చేస్తుంది. ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడకుండా కంట్రిబ్యూషన్ ఎలా పెంచవచ్చన్న దానిపై ప్రభుత్వం చర్చిస్తోంది. పాత పెన్షన్ పథకం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. చివరగా డ్రా చేసిన జీతం ఆధారంగా పెన్షన్ వస్తుంది. ఇంకా అంతేకాకుండా ద్రవ్యోల్బణం రేటు పెరగడంతో డీఆర్ కూడా పెరుగుతుంది.కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను అమలు చేస్తే.. పెన్షన్ అమౌంట్ అనేది కూడా పెరుగుతుంది. అందుకే పాత పెన్షన్ విధానానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

OPS

సంబంధిత వార్తలు: