LIC: తక్కువ పెట్టుబడితో లాభాలిచ్చే పాలసీ?

Purushottham Vinay
ఎల్‌ఐసీ అంటేనే జీవితానికి సురక్షత, భద్రత. ఎన్ని ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఉన్నా కూడా ఎంత వడ్డీలు చెల్లిస్తున్నా కూడా  జనాలు ఎక్కువగా ఎల్ఐసీపైనే ఆసక్తి చూపుతున్నారు.ఎందుకంటే ఈ ఎల్ఐసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అవడంతో సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది.ఇంకా అంతే కాకుండా పెట్టిన పెట్టుబడికి కూడా తగిన రాబడి వస్తుండటంతో చాలా మంది ఇందులోని వివిధ స్కీం లను ఎంచుకుంటున్నారు. అందుకే lic ప్రతి ఒక్కరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విభిన్నరకాల బీమా పాలసీలను తీసుకువస్తూనే ఉంది.ఇప్పుడు ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని అందించే పథకం గురించి తెలుసుకుందాం. దీనిలో మీ కుటుంబం పెట్టుబడి పెట్టడం ద్వారా పొదుపు ఇంకా అలాగే భద్రత రెండింటికీ కూడా హామీని పొందుతారు. ఈ పాలసీ బీమా పేరే జ్యోతి ప్లాన్. ఈ పథకం నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత ఇంకా అలాగే జీవిత బీమా సేవింగ్స్ ప్లాన్. ఇప్పుడు దీనికి సంబందించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.ఈ బీమా జ్యోతి పాలసీలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు రూ.1,000పై ప్రతి సంవత్సరం కూడా రూ.50 భారీ రాబడిని పొందుతారు. ఇంకా అలాగే దీనితో పాటు, పాలసీదారుడు పాలసీ పూర్తయ్యేలోపు కనుక మరణిస్తే, అటువంటి పరిస్థితిలో, అతని కుటుంబం మరణ ప్రయోజనం కూడా పొందుతుంది.


అలాగే పాలసీదారుడు పాలసీ పూర్తయ్యే దాకా జీవించి ఉంటే, అతను హామీతో కూడిన మొత్తం రాబడిని కూడా పొందుతాడు.ఇక ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు కనీసం రూ. 1 లక్ష హామీ మొత్తాన్ని పొందుతారు.ఇందులో గరిష్ట హామీ మొత్తంపై పరిమితి లేదు.అలాగే 15 నుంచి 20 ఏళ్ల కాలానికి ఈ పాలసీలో పెట్టుబడి పెడుతున్నారు.అయితే మీరు ఈ పాలసీలో మొదటి 5 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి.ఇక ఇందులో, పాలసీని కొనుగోలు చేయడానికి, మీ వయస్సు 90 రోజుల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.ఇంకా అదే సమయంలో, మీరు కనీసం 18 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల మధ్య పాలసీ, మెచ్యూరిటీని మీరు పొందుతారు.మీరు ప్రతి నెల, మూడు నెలలు, 6 నెలలు ఇంకా వార్షికంగా ఈ పాలసీలో పెట్టుబడిని పెట్టవచ్చు. ఈ పాలసీలో నెలకు కనీసం రూ.5,000 చొప్పున వార్షిక ప్రాతిపదికన రూ.50,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ పాలసీని కొనుగోలు చేయడానికి మీరు lic బ్రాంచ్‌కి వెళ్లవచ్చు. ఇంకా అలాగే మీకు కావాలంటే, మీరు ఆన్‌లైన్‌లో కూడా ఈ పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: